Asian Games 2023 | కన్నుల పండువగా ఆసియా గేమ్స్ ఆరంభ వేడుక.. భారత పతాక ధారులు వీళ్లే
Asian Games 2023 : ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ పోటీల ఆరంభ వేడుక ఈరోజు అట్టహాసంగా జరిగింది. చైనాలోని హాంగ్జూ (Hangzhou) ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, లైట్ షో(Light Show)తో కన్నుల పండువగా నిర్వహించారు. ఆటగాళ్ల పరేడ్ సమయంలో స్టార్ బాక్సర్..
Asian Games 2023 : ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ పోటీల ఆరంభ వేడుక ఈరోజు అట్టహాసంగా జరిగింది. చైనాలోని హాంగ్జూ (Hangzhou) ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, లైట్ షో(Light Show)తో కన్నుల పండువగా నిర్వహించారు. ఆటగాళ్ల పరేడ్ సమయంలో స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్(Lovlina Borgohain), హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh) భారత బృందానికి ముందు నడిచారు. వీళ్లిద్దరితో పాటు క్రీడాకారులంతా జాతీయ జెండాలు చేతబూని జయజయ ధ్వానాలు చేశారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ తాత్కాలికి అధ్యక్షడు రణధీర్ సింగ్(Randhir Singh) భారత అథ్లెట్లను ఉత్సాహపరిచాడు.
Indian contingent led by flag-bearers Harmanpreet Singh and Lovlina Borgohain 🏑🥊
Grit and Glory⚡️सबसे आगे होंगे हिंदुस्तानी 🇮🇳 #AsianGames #TeamIndia pic.twitter.com/FGqBthDb7a
— Doordarshan Sports (@ddsportschannel) September 23, 2023
ఆసియా గేమ్స్‌కు చైనా ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. 1990లో బీజింగ్, 2010 గంగ్జౌలో ఈ పోటీలు జరిగాయి. ఈసారి నిర్వహిస్తున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది. మన దేశం నుంచి 655 మంది అథ్లెట్లు .. 39 విభాగాల్లో పతకాల కోసం పోటీ పడనున్నారు. 2018లో జకార్తా (ఇండోనేషియా) వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఇండియా 70 పతకాలు (16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు) సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది.
తెలంగాణ నుంచి 13 మంది
ఈసారి తెలంగాణ నుంచి 13 మంది పోటీ పడుతున్నారు. బాక్సింగ్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్‌తో పాటు షూటర్ ఇషాసింగ్ తమదైన ముద్ర వేసేందుకు రెడీ అయ్యారు. అథ్లెటిక్స్‌లో నిలకడగా రాణిస్తున్న అగసర నందిని (హెప్టాథ్లాన్)పై భారీ అంచనాలు ఉన్నాయి. చెస్‌లో అర్జున్ ఇరగైసి, స్విమ్మింగ్‌లో వ్రిత్తి అగర్వాల్, టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ పతకాలు గెలిచే సత్తా ఉన్నవాళ్లే.
ఇవి కూడా చదవండి
MS Dhoni | లక్కంటే మనోడిదే.. విమానంలో ధోనీ పక్క సీటు పట్టేశాడు
Cristiano Ronaldo | నా కాళ్లు చెప్పేంత వరకూ ఆడుతూనే ఉంటా.. రిటైర్మెంట్ వార్తలపై రొనాల్డో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

