పొర్వొరిమ్: అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన రంజీ ప్లేట్ గ్రూప్‌లో గోవా బ్యాటర్లు కశ్యప్ బాక్లే (300 నాటౌట్), స్నేహల్ కౌత్నకర్ (314 నాటౌట్) టోర్నీ చరిత్రలో రికార్డు భాగస్వామ్యాన్ని నమోదుచేశారు.
ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయమైన 606 పరుగులు జతచేసి గతంలో స్వప్నీల్-అంకిత్ పేరిట ఉన్న రికార్డు(594)ను అధిగమించారు.