INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. తొలిపోరులో శ్రీలంకకు షాకిచ్చిన టీమిండియా ఈసారి పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో పోరాడగలిగే స్కోర్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన ఆ తర్వాత దాయాది పని పట్టింది. క్రాంతి గౌడ్ (3-20) స్నేహ్ రానా(2-38)లు చక్కని బౌలింగ్‌తో వికెట్లు వేట కొనసాగించారు. దీప్తి శర్మ(3-45) చివరి వికెట్ తీయడంతో 88 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. తద్వారా ఈ ఫార్మాట్లో చిరకాల ప్రత్యర్థిపై 12 విజయాలతో పైచేయి సాధించింది.
తొలి వరల్డ్ కప్ వేటలో భారత జట్టు దూసుకెళ్లుతోంది. ఆరంభ మ్యాచ్‌లో కో హోస్ట్ శ్రీలంకకు చెక్ పెట్టిన టీమిండియా.. రెండో గేమ్‌లో పాకిస్థాన్ భరతం పట్టింది. హర్లీన్ డియోల్ (46), రీచా ఘోష్ (35 నాటౌట్) మెరుపులతో ప్రత్యర్థికి కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించి భారత్.. బంతితో పాక్ బ్యాటర్లను వణికించింది. ఛేదనలో ఆది నుంచి తడబడిన పాక్.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు.
📸 📸
Smiles and celebrations all around! 😊
A massive win in Colombo and #TeamIndia have sealed victory no. 2⃣ in #CWC25 🔝👏
Scorecard ▶ https://t.co/9BNvQl3J59#WomenInBlue pic.twitter.com/LlIeJiGrgX
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
ఆరు పరుగులకే ఓపెనర్ మునీబా అలీ(2) రనౌట్ కాగా.. ఆకాసేపటికే సడాఫ్ షమాస్ (6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం.. రేణుకా సింగ్ ఓవర్లో సిద్రా అమిన్ (9 నాటౌట్) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రీచా వదిలేసింది. డైవ్ చేయడంతో బంతి ఆమె మణికట్టుకు తగిలి కింద పడింది. లేదంటే పాక్ మూడో వికెట్ పడేది. పది ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయిన పాక్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అలియా రియాజ్ (2) వెనుదిరిగాక నటాలియా పర్వేజ్(33), సిద్రా అమిన్(81)లు క్రీజులో పాతుకుపోయారు.
భారత బౌలర్లను విసిగిస్తూ నాలుగో వికెట్‌కు హాఫ్ సెంచరీకిపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే… 69 రన్స్ జోడించిన పర్వేజ్‌ను క్రాంతిగౌడ్ వెనక్కి పంపి పాక్‌ను కష్టాల్లోకి నెట్టింది. రాధా యాదవ్ చక్కగా క్యాచ్ అందుకోవడంతో పాక్ నాలుగో వికెట్ పడింది. కాసేపటికే అమిన్ సింగిల్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. కానీ, మరో ఎండ్‌లో ఆమెకు సహకరించేవాళ్లు కరువయ్యారు. సిద్రా నవాజ్ (14)ను రిటర్న్ క్యాచ్‌తో స్నేహ్ రానా డగౌట్ చేర్చగా.. ఆ వెంటనే షమీమ్(0)ను దీప్తి బౌల్డ్ చేసింది. ఒంటరిపోరాటం చేస్తున్న అమిన్ స్వీప్ షాట్ ఆడి మిడ్ వికెట్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చేతికి చిక్కడంతో పాక్ ఓటమి ఖాయమైంది. దీప్తి వేసిన 43 ఓవర్లో డయానా (9) రనౌట్ కాగా.. చివరి బంతికి సడియా (0) ఔట్ కావడంతో పాక్ 159 పరుగులకే ఆలౌటయ్యింది. వరుసగా రెండో విజయంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది టీమిండియా.
Deepti Sharma 🤝 Sneh Rana
Off-spinners doing the magic ✨
🔙 to 🔙 wickets for #TeamIndia
Updates ▶ https://t.co/9BNvQl3J59#WomenInBlue | #CWC25 | @Deepti_Sharma06 | @SnehRana15 pic.twitter.com/n052snOW8F
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
శ్రీలంకపై చెలరేగిన మ్యాచ్‌లో భారత టాపార్డర్ పాకిస్థాన్‌పై విఫలమైంది. టాప్ గన్స్ అయిన మంధాన, ప్రతీక, హర్మన్‌ప్రీత్‌లు దాయాది బౌలర్లపై ఎదురుదాడి చేయలేకపోవడంతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించేందుకు మిడిలార్డర్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్ ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్ (46) రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ (32), దీప్తి శర్మ(25)లు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. జట్టు స్కోర్ 230 దాటడమే గగనం అనుకున్న దశలో రీచా ఘోష్(35 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడింది. కానీ, చివరి ఓవర్లో రెండు వికెట్లు పడడంతో భారత్ 247 పరుగులకు ఆలౌటయ్యింది.