Smriti-Palash | అందరూ ఊహించినట్లుగా టీమిండియా వుమెన్స్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ రద్దయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లుగా ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 1.08 గంటల సమయంలో స్మృతి మంధాన ఇన్స్టాగ్రామ్ వేదిక పోస్ట్ పెట్టింది. పలాష్‌తో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. గత కొన్నివారాలుగా తన జీవితం గురించి ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయని.. ఈ సమయంలో బహిరంగంగా మాట్లాడడం ముఖ్యమని భావిస్తున్నాను.
వివాహం రద్దయ్యిందని.. ఈ విషయాన్ని ఇక్కడే ముగించాలనుకుంటున్నాను. ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలి. ముందుకు సాగేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను. మనందరి వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను. నా దేశానికి ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నాను. వీలైనంత కాలం భారత్ తరఫున ఆడటం కొనసాగించాలని, ట్రోఫీలు గెలవడం కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఎప్పుడూ నా దృష్టి దానిపైనే ఉంటుంది. మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు, ఇకపై ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది.’ అంటూ స్మృతి పోస్ట్ పెట్టింది.

Smriti Mandhana Post
ఆ తర్వాత పులాష్ సైతం ఇన్స్టాగ్రామ్ వేదికగా పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లుగా తెలిపారు. ‘నా జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నాను. నా వ్యక్తిగత సంబంధం నుంచి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. తనకు అత్యంత పవిత్రమైన వ్యక్తిగత విషయంపై నిరాధారమైన పుకార్లకు జనం తేలిగ్గా స్పందించడం చాలా కష్టంగా అనిపించింది. ఇది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ. తన విశ్వాసాలను పట్టుకుని గౌరవంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటా’నని పలాష్ ముచ్చల్ పోస్ట్ పెళ్లాడు. అయితే, పరువు నష్టం కలిగించేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై తన బృందం న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమలో ఉండగా.. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 21న హల్ది వేడుక జరిగింది. స్మృతితో పాటు షెఫాలి వర్మ, రిచా ఘోష్, శ్రేయంకా పాటిల్, రేణుకా సింగ్, శివాలి షిండే, రాధా యాదవ్, జెమీమా వంటి క్రీడాకారిణులు హాజరయ్యారు. నవంబర్ 22న, స్మృతి-పలాష్ మెహందీ వేడుక జరిగింది. నవంబర్ 23న సాంగ్లిలో వివాహానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. భారత జట్టు మహిళా క్రికెటర్లతో పాటు వీఐపీలు వివాహానికి తరలివచ్చారు. అయితే, నవంబర్ 23న సాయంత్రం స్మృతి అస్వస్థతకు గురయ్యారు. దాంతో వివాహాన్ని వాయిదా వేశారు. అయితే, పలాష్ సైతం ఆసుపత్రిలో చేరాడు. ఆ సమయంలో పెళ్లి రద్దు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఇద్దరు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఎందుకు పెళ్లిని రద్దు చేసుకున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Palash Post