Smriti Mandhana | నేను దేశానికి ఆడాలనేది నాన్న కల.. లెఫ్ట్ హ్యాండర్‌గా ఎందుకు మారానంటే..? : మంధాన
Smriti Mandhana : భారత మహిళల క్రికెట్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాలు నమోదు చేసింది. టీమిండియా జైత్రయాత్రలో ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పాత్ర మరువలేనిది. గత ఏడేండ్లుగా భారత జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్న మంధాన...
Smriti Mandhana : భారత మహిళల క్రికెట్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాలు నమోదు చేసింది. టీమిండియా జైత్రయాత్రలో ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పాత్ర మరువలేనిది. గత ఏడేండ్లుగా భారత జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్న మంధాన తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి(Kaun Banega Crorepati) సెట్స్‌లో తన ప్రయాణం గురించి వెల్లడించింది. పసిప్రాయంలోనే క్రికెట్‌వైపు అడుగులు వేయడం గురించి మంధాన ఏం చెప్పిందంటే..?
‘నా చిన్నతనం నుంచి మానాన్నశ్రీనివాస్, అన్నయ్య శ్రవణ్ క్రికెట్ ఆడడం గమనించేదాన్ని. అయితే.. మానాన్నను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేదుకు ఇంట్లోవాళ్లు అనుమతించలేదు. దాంతో, ఆయన మాలో ఒక్కరైనా దేశానికి ఆడాలని కలగన్నాడు. ఆయన కోరుకున్నట్టుగానే నేను భారత జట్టుకు ఎంపికయ్యాను. దాంతో, నాన్న సంతోషంతో పొంగిపోయాడు’ అని మంధాన తెలిపింది.
తండ్రి శ్రీనివాస్‌తో మంధాన

అంతేకాదు తాను మొదట్లో కుడి చేతివాటం బ్యాటర్ అని, సోదరుడిని చూసి లెఫ్ట్ హ్యాండర్‌గా మారానని ఈ స్టార్ క్రికెటర్ చెప్పుకొచ్చింది. ‘మా సోదరుడు బ్యాటింగ్ చేస్తుంటే నేను బాల్ అందించేదాన్ని. అతడిని చూసి అప్పటివరకూ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే నేను లెఫ్ట్ హ్యాండ్‌తో సాధన చేయడం మొదలెట్టాను’ అని మంధాన తెలిపింది.

ఈమధ్యే సొంతగడ్డపై ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో అర్ధ శతకాలతో చెలరేగిన మంధాన వన్డే, టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇప్పటవరకూ మంధాన 6 టెస్టులు, 80 వన్డేలు, 125 టీ20లు ఆడింది. టెస్టుల్లో 480 పరుగులు, వన్డేల్లో 3,179 రన్స్ బాదింది. ఈ చిచ్చరపిడుగు పొట్టి ఫార్మాట్లో 2,998 పరుగులు సాధించింది.

బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో మంధాన రికార్డు ధరతో చరిత్ర సృష్టించింది. ఆమెను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) రూ.3.4 కోట్లకు కొన్నది. అయితే.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన మంధాన తీవ్ర నిరాశకు గురి చేసింది. అయినా సరే బెంగళూరు ఆమెను రెండో సీజన్ కోసం అట్టిపెట్టుకుంది.
ఇవి కూడా చదవండి
- Warangal | వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పెరిగిన నేరాలు : సీపీ అంబర్ కిషోర్ ఝా
- Sunburn Event | హైదరాబాద్‌లో సన్‌బర్న్ ఈవెంట్ రద్దు.. ఆన్లైన్ టికెట్ల విక్రయాలు నిలిపివేత
- Road Accident | మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

