Sunburn Event | హైదరాబాద్‌లో సన్‌బర్న్ ఈవెంట్ రద్దు.. ఆన్లైన్ టికెట్ల విక్రయాలు నిలిపివేత
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్ ఈవెంట్‌ను (Sunburn Event) నిర్వాహకులు రద్దుచేశారు.
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్ ఈవెంట్‌ను (Sunburn Event) నిర్వాహకులు రద్దుచేశారు. బుక్‌మై షోలో దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాకుడు సుమంత్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. అదేవిధంగా అనుమతి లేకుండా టికెట్లు విక్రయిస్తున్న బుక్‌మై షో, నోడల్ అధికారులకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో బుక్‌మై షోలో సన్ బర్న్ షో ప్లాట్‌ఫామ్‌పై హైదరాబాద్ ఈవెంట్ కనిపించడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈవెంట్ టికెట్లు మాత్రం అమ్మకానికి పెట్టారు.
సన్‌బర్న్ ఈవెంట్ నిర్వాహకులు సన్‌బర్న్ మ్యూజికల్ నైట్ పేరిట న్యూఇయర్ ఈవెంట్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే వారి దరఖాస్తు ఇంకా పరిశీలనలోనే ఉందని మాదాపూర్ అదనపు డీసీపీ నర్సింహా రెడ్డి అన్నారు. కానీ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈ మేరకు అనుమతి రాకముందే బుక్ మై షోలో టికెట్లు విక్రయించినట్లు తమ విచారణలో వెల్లడయిందన్నారు. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే రూ.1499 ప్రారంభ ధర నుంచి రూ. 4999 చొప్పున టికెట్లు విక్రయించడం చట్ట విరుద్ధమని, దీంతో సన్‌బర్న్ ఈవెంట్ ఆర్గనైజర్ సుమన్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ వెల్లడించారు. ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామని, అనుమతి లేని ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల జారీకి సహకరించిన బుక్ మై షో నోడల్ ఆఫీసర్, ఎండీలకు సైతం నోటీసులు జారీ చేశామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

