INDW vs SLW : మహిళల ఆసియా కప్ ఫైనల్లో స్మృతి మంధాన(51) అర్ధ శతకంతో చెలరేగింది. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఫిఫ్టీతో విరుచుకుపడింది. దాంతో, టీమిండియా రన్ రేటు 7 పైనే కొనసాగుతోంది. మంధనాతో కలిసి ధాటిగా ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(11) సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. ప్రస్తుతం జెమీ రోడ్రిగ్స్(0) ఆడుతోంద. 13 ఓవర్లకు టీమిండియా స్కోర్ .. 90/3.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(16), ఉమా ఛెత్రీ()లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, స్మృతి మంధాన(51) కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(11)తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టింది. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 29 పరుగులు జోడించారు.