WTC Points : కెన్నింగ్టన్ ఓవల్ టెస్టులో భారీ తేడాతో ఓడిన ఇంగ్లండ్ (England)కు మరో షాక్. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC 2025-27)లో ఆ జట్టు ఏకంగా 12 పాయింట్లు కోల్పోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జో రూట్ సారథ్యంలోని ఆతిథ్య జట్టు.. స్లో ఓవర్ రేటు(Slow Over Rate) కారణంగా డజన్ పాయింట్ల జరిమానా పడింది. అంతేకాదు మ్యాచ్ ఫీజులో సగం పైసలే దక్కనున్నాయి. అసలే 253 పరుగుల తేడాతో దారుణంగా ఓడిన బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు ఇది మింగుడుపడని విషయమే.
స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌కు భారీ నష్టం వాటిల్లింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో ముందంజ వేయాలనుకున్న ఆ జట్టు ఆశలపై స్లో ఓవర్ రేటు నీళ్లు చల్లింది. కెన్నింగ్టన్ ఓవల్ టెస్టులో నిర్ణీత సమయం కోటా పూర్తి చేయలేదు.
England were penalised 12 World Test Championship points and fined 50% of their match fee for maintaining a slow over-rate in their loss to New Zealand at The Oval pic.twitter.com/b6zfpEMHxB
— Cricinfo (@ESPNcricinfo) June 22, 2026
ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం 12 ఓవర్ల లోటుకు 12 పాయింట్లు కోత విధించాడు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్. దాంతో డబ్ల్యూటీసీ 2025-27లో ఇంగ్లండ్ కీలకమైన 12 పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా 38 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏడో స్థానంలో నిలిచింది. ఇది చాలదన్నట్టు.. స్లో ఓవర్ రేటు మూలంగా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది.
డబ్ల్యూటీసీలో ఇంగ్లండ్ జట్టు ఇంత పెద్ద మొత్తంలో పాయింట్లు చేజార్చుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2023-25 సైకిల్లోనూ ఇంగ్లండ్ ఏకంగా 19 పాయింట్లను నష్టపోయింది. అప్పుడు కూడా ప్రత్యర్థి న్యూజిలాండే కావడం విశేషం. భారీగా పాయింట్ల కోతపై ఐసీసీని ఎద్దేవా చేస్తూ వెంటనే కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు.
England have also been fined 50% of their match fees for maintaining a slow over rate against New Zealand at The Oval. pic.twitter.com/Xs7uBxSrb8
— Wisden (@WisdenCricket) June 22, 2026
‘ఐసీసీకి అభినందనలు. పది గంటల ఆట ఉండగానే మ్యాచ్‌ను ముగించాం’ అని స్టోక్స్ రాసుకొచ్చాడు. అంతకుముందు కూడా ఇదే తీరుగా నష్టపోయింది ఇంగ్లండ్ 2021లో బ్రిస్బేన్ టెస్టు అనంతరం ఎనిమిది పాయింట్లు, 2022లో ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు తర్వాత రెండు పాయింట్లు కోల్పోయింది.