దేశవాళీలో పెరెరా మెరుపులు
కొలంబో: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా ఆల్‌రౌండర్ తిసార పెరెరా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ టోర్నీలో శ్రీలంక ఆర్మీ తరఫున ఆడిన పెరెరా అజేయంగా 13 బంతుల్లోనే 52 పరుగులు చేశా డు. సోమవారం బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్‌పై జరిగిన మ్యాచ్‌లో తిసార ఈ ఫీట్ నమోదు చేశాడు. చివరి 20 బంతులు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చిన పెరెరా మొత్తం 8 సిక్సర్లు బాదాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొమ్మిదో బ్యాట్స్‌మన్‌గా అతడు నిలిచాడు.
ఇవి కూడా చదవండి: