Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Jensen Huang : ఎన్వీడియా బోర్డు సీఈవో జేన్సన్ హువాంగ్ను తొలగించే ప్రక్రియలో ఉన్నది. కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఓ మహిళతో ఆయన రిలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే చైనీస్ గూఢాచారితో రిలేషన్ ఉన్నట్లు ఆయన కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: అమెరికా చిప్ తయారీ కంపెనీ ఎన్వీడియా సీఈవో జేన్సన్ హువాంగ్‌పై చర్యలు తీసుకునేందుకు ఆ కంపెనీ బోర్డు సిద్దమైనట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. చైనీస్ గూఢాచారితో పాటు మరో మహిళతోను సీఈవో జేన్సన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. త్వరలోనే కంపెనీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారని ఆ నివేదికలో వెల్లడైంది. ఒకవేళ హువాంగ్ను తప్పిస్తే, అప్పుడు సుమారు 4 ట్రిలియన్ల డాలర్ల చిప్ తయారీ కంపెనీ భవితవ్యం ఆగమ్యగోచరంగా మారనున్నది. జేన్సన్ అఫైర్ వార్తలు బయటకు పొక్కడంతో ఆ కంపెనీ షేర్లు అమాంతం 8 శాతం పడిపోయాయి. ఈ వారంలోనే ఆ కంపెనీ సుమారు 600 బిలియన్ల మార్కెట్ విలువను కోల్పోయింది.
హువాంగ్ను తక్షణమే తొలగించలేని పరిస్థితిలో ఆ కంపెనీ ఉన్నది. ఎందుకంటే ఆయనకు వారసుడిగా ఎవర్ని ప్రకటించాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ కంపెనీ విధానాలను కానీ, చట్టాలను కానీ హువాంగ్ ఉల్లంఘించినట్లు రుజువైతే, దానికి తగిన ఆధారాలు ఉంటే, ఆయనపై చర్యలు తీసుకుంటామని టెక్నాలజీ రీసర్చ్ హెడ్ గిల్ లూరియా తెలిపారు. చైనీస్ గూఢాచారిణి అలిస్ హువాంగ్‌తో పాటు కంపెనీలో పనిచేసే ఓ ఎగ్జిక్యూటివ్ మహిళతోనూ హువాంగ్ రిలేషన్లో ఉన్నట్లు ఊహాగానాలు వ్యాపించాయి. ఎన్వీడియా హెల్త్‌కేర్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా చేస్తున్న కింబర్లే పావల్తో జేన్సన్ రిలేషన్లో ఉన్నట్లు అమెరికా మీడియా తెలిపింది. దీనిపై వ్యక్తిగతంగా ఇద్దరూ స్పందించలేదు. అయితే తాజా ఆరోపణల నేపథ్యంలో జేన్సన్పై వేటుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

