Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 66వ రోజు ఎపిసోడ్ ప్రేక్షకులకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించింది. ముఖ్యంగా హౌస్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు ముకేశ్, శివకుమార్‌లకు ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారింది. ఒకవైపు ముకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి భావోద్వేగానికి గురిచేయగా.. మరోవైపు శివకుమార్‌కు కాబోయే భార్య ప్రియాంక జైన్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 66వ రోజు ఎపిసోడ్ ప్రేక్షకులకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించింది. ముఖ్యంగా హౌస్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు ముకేశ్, శివకుమార్‌లకు ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారింది. ఒకవైపు ముకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి భావోద్వేగానికి గురిచేయగా.. మరోవైపు శివకుమార్‌కు కాబోయే భార్య ప్రియాంక జైన్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. అంతేకాదు, హౌస్మేట్స్ సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. దీంతో బుధవారం నాటి ఎపిసోడ్లో ఎమోషన్స్, ప్రేమ, ఆనందం కలగలిసిపోయాయి.
66వ రోజు ఎపిసోడ్లో ముందుగా ముకేశ్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ లభించింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. చాలా రోజుల తర్వాత తల్లిని చూసిన ముకేశ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెను చూడగానే దగ్గరకు వెళ్లి హత్తుకున్నాడు. తల్లి కూడా కొడుకును ఆప్యాయంగా కౌగిలించుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ దృశ్యాలు హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా కదిలించాయి. అనంతరం ముకేశ్ తల్లి ఇంటి సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా ముకేశ్, వర్షిణి మధ్య ఉన్న స్నేహం గురించి ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రవర్తనను బయట నుంచి చూస్తున్నప్పుడు ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా అని ముకేశ్ తల్లిని ప్రశ్నించాడు. అందుకు ఆమె నీ కోపమే నీలో ఉన్న ప్రధానమైన లోపం అని చెప్పింది. వెంటనే స్పందించిన ముకేశ్.. తన కోపాన్ని వర్షిణి చాలా వరకు తగ్గించిందని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ కోపాన్ని మరింత తగ్గించుకోవాలని తల్లి కొడుకుకు సూచించింది.
తన తల్లి గురించి ముకేశ్ చెప్పిన మాటలు ఈ ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన తండ్రికి స్ట్రోక్ వచ్చిన సమయంలో తల్లి ఎంతో కష్టపడ్డారని వెల్లడించాడు. దాదాపు రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైన తండ్రిని తల్లి ఒక్కరే దగ్గరుండి చూసుకున్నారని తెలిపాడు. ఆ సమయంలో ఆమె ఎప్పుడూ విసుక్కోవడం కానీ, అసహనం వ్యక్తం చేయడం కానీ తాను చూడలేదని చెప్పాడు.తల్లి పడిన కష్టాలు, ఆమె చూపించిన సహనం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ముకేశ్ భావోద్వేగంగా వివరించాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నిర్ణయించుకోవడానికి తన తల్లే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న హౌస్మేట్స్ సైతం భావోద్వేగానికి గురయ్యారు.
ముకేశ్ తల్లి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి అమన్ తండ్రి ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా ఇంటి సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించారు. తన కుమారుడితో కొంతసేపు సమయం గడిపి, అతడికి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను చూసే అవకాశం రావడంతో అమన్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా వరుసగా కుటుంబ సభ్యుల రాకతో హౌస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ ఎపిసోడ్లో మరో హైలైట్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ఎంట్రీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న ప్రియాంక, ప్రస్తుతం సీజన్ 10లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న శివకుమార్‌కు కాబోయే భార్య అన్న విషయం తెలిసిందే. శివకుమార్‌కు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది.
అయితే ప్రియాంకను చూసిన వెంటనే శివకుమార్ గుర్తుపట్టేశాడు. మిగతా హౌస్మేట్స్ కూడా ఆమెను గుర్తించి ఆశ్చర్యపోయారు. చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకున్న ఈ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శివకుమార్, ప్రియాంక ఒకరినొకరు కౌగిలించుకుని తమ ప్రేమను వ్యక్తపరిచారు. ముద్దులతో, ఆప్యాయతతో కొంతసేపు హౌస్‌లో సందడి చేశారు. ప్రియాంక ఎంట్రీతో సంతోషంలో మునిగిపోయిన శివకుమార్‌కు మరో మధురమైన అనుభూతి ఎదురైంది. హౌస్మేట్స్ అందరి సమక్షంలో ఈ జంట నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఎంగేజ్మెంట్ దుస్తుల్లో శివకుమార్, ప్రియాంక జంట ఎంతో అందంగా కనిపించారు. ఇద్దరూ తమ ప్రేమను మరోసారి వ్యక్తపరుచుకుంటూ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హౌస్మేట్స్ అందరూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆనందంలో పాలుపంచుకుంటూ సరదాగా సందడి చేశారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు, గొడవలు, నామినేషన్లు, ఎలిమినేషన్లతో సాగిపోయే ఎపిసోడ్లకు భిన్నంగా ఈసారి కుటుంబ అనుబంధాలు, ప్రేమానురాగాలు ప్రధానంగా నిలిచాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

