Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
Sharwanand | టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోగి’ విడుదల వాయిదా పడటంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మొదట ఈ సినిమాను నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా పడటంతో కొత్త రిలీజ్ డేట్‌పై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
Sharwanand | టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోగి’ విడుదల వాయిదా పడటంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మొదట ఈ సినిమాను నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా పడటంతో కొత్త రిలీజ్ డేట్‌పై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 11న ‘భోగి’ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, శర్వానంద్ మాస్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దీంతో నవంబర్ 12న సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూశారు. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది.
అయితే ఇటీవల జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దు కావడంతో సినిమా వాయిదా పడుతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అధికారికంగా విడుదల వాయిదాను ప్రకటించారు.అనుకోని సాంకేతిక, నిర్మాణపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. సినిమా విడుదల వాయిదాపై వస్తున్న అనవసరమైన రూమర్లను, ఊహాగానాలను నమ్మవద్దని అభిమానులను కోరారు. థియేటర్లలో ప్రేక్షకులకు గొప్ప యాక్షన్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే పర్ఫెక్ట్ ఔట్పుట్ కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు పూర్తి చేసి, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
తాజాగా ‘భోగి’ కొత్త విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. డిసెంబర్ 11న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. ఒకవేళ డిసెంబర్ 11నే విడుదల చేస్తే శర్వానంద్‌కు బాక్సాఫీస్ వద్ద కొంత పోటీ తప్పదు. ఎందుకంటే అదే రోజున మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ‘ఇడుపు కాయితం’, ‘పాకెట్ రాకెట్స్’ చిత్రాలపై సినీ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అదే రోజున ‘ఇంకా అనుకోలేదు’, ‘రాయవలస’ వంటి చిన్న చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘భోగి’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో పాటు ఇతర సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

