Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 12 (గురువారం) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 12 (గురువారం) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రావడం విశేషం. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి తనదైన స్టైల్, స్వాగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మరోసారి తమ అభిమాన సూపర్‌స్టార్ యాక్షన్‌ను ఆస్వాదించాలనుకునే వారు ఇప్పుడు ఇంట్లోనే సినిమాను చూసే అవకాశం దక్కించుకున్నారు.
‘జైలర్ 2’ ఓటీటీ విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరిగింది. థియేటర్లలో ప్రదర్శించిన వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీలో సుమారు 30 నిమిషాల అదనపు సన్నివేశాలతో కూడిన అన్‌కట్ వెర్షన్ విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. దీంతో డిలీట్ చేసిన సీన్లు, అదనపు యాక్షన్ ఎపిసోడ్స్ చూడొచ్చని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఓటీటీలో విడుదలైన వెర్షన్ చూసిన ప్రేక్షకులకు కొంత నిరాశ ఎదురైంది. ఎలాంటి అదనపు సన్నివేశాలు లేకుండా థియేటర్లలో ప్రదర్శించిన వెర్షన్‌నే ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 2 గంటల 43 నిమిషాల రన్టైమ్తో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో అన్‌కట్ వెర్షన్ కోసం ఎదురుచూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రూ.830 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. రజనీకాంత్ కెరీర్లో మరో భారీ విజయంగా నిలవడంతో పాటు తమిళ సినిమా బాక్సాఫీస్ రికార్డుల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటికీ థియేటర్లలో ‘జైలర్ 2’ హవా ఇంకా కొనసాగుతోంది. నవంబర్ 11న ఒక్కరోజే బుక్‌మైషో ద్వారా 7 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఈ ప్లాట్ఫామ్లో సినిమా మొత్తం టికెట్ అమ్మకాలు 1.12 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కేవలం 12 రోజుల్లోనే కోటి టికెట్ల విక్రయాల మైలురాయిని అందుకున్న తొలి తమిళ చిత్రంగా కూడా ‘జైలర్ 2’ రికార్డు సృష్టించినట్లు ప్రచారం జరిగింది. ఓటీటీ విడుదలకు ముందు కూడా థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ కొనసాగడం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

