Sachithra Senanayake | మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్‌కు షాక్.. విదేశీ పర్యటనలపై నిషేధం
Sachithra Senanayake : శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్రా సేనానాయకే(Sachithra Senanayake)కు భారీ షాక్ తగిలింది. మ్యాచ్ ఫిక్సింగ్(match-fixing) ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై కొలంబోలోని స్థానిక కోర్టు ఆంక్షలు విధించింది. సేనానాయకే విదేశాలకు వెళ్లడంపై 3 నెలల నిషేధం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్...
Sachithra Senanayake : శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్రా సేనానాయకే(Sachithra Senanayake)కు భారీ షాక్ తగిలింది. మ్యాచ్ ఫిక్సింగ్(match-fixing) ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై కొలంబోలోని స్థానిక కోర్టు ఆంక్షలు విధించింది. సేనానాయకే విదేశాలకు వెళ్లడంపై 3 నెలల నిషేధం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియజేసింది. రెండేళ్ల క్రితం లంక ప్రీమియర్ లీగ్(2020 Lanka Premier League)లో సేనానాయకే మ్యాచ్ ఫిక్స్ంగ్కు పాల్పడ్డాడు.
టోర్నీ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిందిగా ఇద్దరు ఆటగాళ్లతో అతను ఫోన్లో మాట్లాడాడు. దాంతో అతడిపై కేసు నమోదైంది. ఆఫ్ స్పిన్నర్ అయిన సేనానాయకే బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శ్రీలంక జట్టులోకి వచ్చాడు. అయితే.. అతడి నాలుగేళ్లకే అతడి కెరీర్ ముగిసింది. 2012 నుంచి 2016 మధ్య అతను 49 వన్డేలు, 24 టీ20, ఒకే ఒక టెస్టు ఆడాడు.
సచిత్రా సేనానాయకే

అయితే.. 2014 జూలైలో ఇంగ్లండ్‌పై వివాదాస్పద బౌలింగ్ యాక్షన్( Illegal Bowling Action )తో సేనానాయకే వార్తల్లో నిలిచాడు. దాంతో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ మ్యాచుల్లో మళ్లీ బౌలింగ్ చేయకుండా ఐసీసీ అతడిపై నిషేధం విధించింది. అదే ఏడాది డిసెంబర్లో మళ్లీ సేనానాయకే బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది.
ఇవి కూడా చదవండి
Sanju Samson | ‘థాంక్యూ సంజూ శాంసన్’.. ఇక కెరీర్ ముగిసినట్టే అంటూ నెట్టింట్లో విమర్శలు
South Africa | ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. సఫారీ జట్టులో నలుగురు యువ కెరటాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

