South Africa | ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. సఫారీ జట్టులో నలుగురు యువ కెరటాలు
South Africa : వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా సఫారీ బోర్డు(South Africa Cricket Board) అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్(T20 Series)కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అందులో డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis), డొనవాన్ ఫెరెరా(Donnovan Ferreira), గెరాల్డ్ కొయెట్జీ, మాథ్యూ బ్రీట్జ్కే...
South Africa : వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా సఫారీ బోర్డు(South Africa Cricket Board) అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్(T20 Series)కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అందులో డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis), డొనవాన్ ఫెరెరా(Donnovan Ferreira), గెరాల్డ్ కొయెట్జీ(Gerald Coetzee), మాథ్యూ బ్రీట్జ్కే(Matthew Breetzke)లు ఉన్నారు. ఈ నలుగురు ఈ సిరీస్‌తో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) రెండో టీ20 కల్లా జట్టుతో కలువనున్నాడు.
అయితే.. ఈరోజు ప్రకటించిన 15 మంది బృందంలో స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబడా, అన్రిచ్ నొర్జెలకు చోటు దక్కలేదు. వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ ఐదుగురు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారని సెలెక్టర్లు తెలిపారు. దేశవాళీలో, ఇతర లీగ్స్‌లో ఈ యంగ్‌స్టర్స్ నిలకడగా రాణిస్తున్నారు. అందుకనే వీళ్లను ఎంపిక చేశాం. అంతర్జాతీయంగా వీళ్ల ప్రదర్శనపై అంచనాకు రావడానికి ఈ సిరీస్ ఉపకరిస్తుంది అని కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించాడు.
PROTEAS SQUAD ANNOUNCEMENT 🚨
🧢 Dewald Brevis receives maiden ODI and T20I call-up
🧢 Donovan Ferreira, Gerald Coetzee and Matthew Breetzke secure T20I nod🏏 Quinton de Kock, Heinrich Klaasen, David Miller, Anrich Nortje and Kagiso Rabada are rested for the #KFCT20Iseries… pic.twitter.com/Iho5Nxqeus
— Proteas Men (@ProteasMenCSA) August 14, 2023
స్లార్ ఆటగాళ్లకు కొదవలేకున్నా ఇప్పటివరకూ ఒక్క వరల్డ్ కప్ గెలవని జట్టు ఏదంటే..? అది దక్షిణాఫ్రికానే. దురదృష్టం కూడా వెన్నంటే ఉండడంతో ఆ జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. అందుకని యువ జట్టును సిద్ధం చేయడానికి పావులు కదుపుతోంది. అండర్ -19 వరల్డ్ కప్‌లో ఇరగదీసిన బ్రెవిస్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లోనూ ఈ రైట్ హ్యాండర్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు.
డెవాల్డ్ బ్రెవిస్

అంతేకాదు స్వదేశంలో జరిగిన టీ20లో అత్యధిక పరుగుల రికార్డు అతడి పేరు మీదే ఉంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SAT20) మొదటి సీజన్లో బ్రెవిస్ 57 బంతుల్లోనే 162 రన్స్ కొట్టాడు. డొనవాన్ ఫెరెరా, గెరాల్డ్ కొయెట్జీ, మాథ్యూ బ్రీట్జ్కేలు కూడా ఈమధ్య నిలకడగా రాణిస్తున్నారు. అందుకని సెలెక్టర్లు వీళ్ల వైపు మొగ్గు చూపారు. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆగస్టు 30న మొదలవ్వనుంది. ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 7న ఆరంభం కానుంది.
ఇవి కూడా చదవండి
Left Handers – Records | లెఫ్ట్ హ్యాండర్సా మజాకా!.. కొడితే రికార్డులు బద్దలవాల్సిందే!
Tymal Mills – Hat-trick | పుట్టిన రోజునాడే హ్యాట్రిక్.. నాలుగో బౌలర్‌గా రికార్డుకెక్కిన మిల్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

