Left Handers – Records | లెఫ్ట్ హ్యాండర్సా మజాకా!.. కొడితే రికార్డులు బద్దలవాల్సిందే!
Left Handers - Records : క్రికెట్ విషయానికి వస్తే కుడి చేతివాటం ఆటగాళ్లతో పోలిస్తే లెఫ్టాండర్స్ అద్భుతాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి కొట్టే షాట్లు అమోఘంగా ఉండేవి. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ల(Left Handed Batters)లో కొందరు అలవికాని రికార్డులను సొంతం చేసుకున్నారు. క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన మిగతా లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు? వాళ్లు సాధించిన...
Left Handers – Records : క్రికెట్లో అని కాదు కానీ.. మామూలుగానే ఎడమ చేతివాటం వారికి కొంచెం బలమెక్కువని నమ్ముతుంటారు. అన్నట్టుగానే వాళ్లు అద్భు తాలు చేస్తూ ఆ మాట నిజమేనని నిరూపిస్తున్నారు. క్రికెట్ విషయానికి వస్తే కుడి చేతివాటం ఆటగాళ్లతో పోలిస్తే లెఫ్టాండర్స్(Left Handed Batters) అద్భుతాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి కొట్టే షాట్లు అమోఘంగా ఉండేవి. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లలో కొందరు అలవికాని రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆ జాబితాలో మన మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) కూడా ఉన్నాడు. ఆగస్టు 13న `ఇంటర్నేషనల్ లెఫ్టాండర్స్ డే`(International Lefthanders Day) సందర్భంగా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు? వాళ్లు సాధించిన రికార్డులేంటి? అన్నది చూద్దాం.
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ మాథ్యూ హెడెన్(Matthew Hayden) 2007 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు సాధించాడు. 2021 పాక్ స్పీడ్‌స్టర్ షహీన్ అఫ్రిదీ(Shaheen Afridi) టీ20 ప్రపంచ కప్‌లో అత్యద్భుత స్పెల్‌తో భారత జట్టును బెంబేలెత్తించాడు. అలాగే.. సనత్ జయసూర్య(Sanath Jayasuriya), చామిందా వాస్ (Chaminda Vaas), మిచెల్ జాన్సన్(Mitchell Johnson), వాసిం అక్రమ్(Wasim Akram) సహా మరెంతోమంది గొప్పగొప్ప రికార్డులు తమ పేర రాసుకున్నారు.
సనత్ జయసూర్య

చెక్కు చెదరని లారా రికార్డు
ప్రపంచంలోని గొప్ప లెఫ్ట్ హ్యాండర్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆటగాడు బ్రియాన్ లారా(). విండీస్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన లారా తన టెక్నిక్, టెంపర్‌మెంట్‌తో ఎన్నో విజయాలు అందుకున్నాడు. 2004లో వెస్టిండీస్‌లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడు టెస్టుల్లో కరీబియన్ జట్టును మట్టికరిపించింది. అయితే, నాలుగో టెస్టులో మాత్రం కెప్టెన్ లారా అద్వితీయమైన ఆటతీరుతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అంటిగ్వాలో జరిగిన ఈ మ్యాచ్‌లో లారా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
బ్రియాన్ లారా

ఆరంభంలోనే డారెన్ గంగా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన లారా.. ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండు రోజులపాటు క్రీజులో నిలిచి అజేయంగా 400 పరుగులు సాధించాడు. దాంతో, టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. లారా బాదుడుతో విండీస్ ఏకంగా 751 పరుగులు చేసింది. అయితే, ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు దశాబ్దాలు గడిచినా లారా రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.
యువీ రాకెట్ వేగం
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్(Yuvraj Singh) బ్యాటింగ్ శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2007-2011 మధ్య టీమిండియా విజయాల్లో కీలక భూమిక పోషించాడు. 2007 టీ20 ప్రపంచ కప్(2007 world cup)లో భాగంగా డర్బన్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్, గౌతం గంభీర్ చక్కని భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, రాబిన్ ఉతప్ప అవుటయ్యే సమయానికి భారత్ స్కోరు అంత గొప్పగా ఏమీ లేదు.
బ్రాడ్ ఓవర్లో 6 సిక్స్‌లు బాదిన యువరాజ్‌సింగ్

నంబర్ 5గా క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 19వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad)కు యువరాజ్ చుక్కలు చూపించాడు. ఆరు బంతులను స్టాండ్స్ ఆవలకు పంపి టీ20 చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్గామరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 218 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రిల్క్రిస్ట్ మాయాజాలం
ప్రపంచంలోని విధ్వంసకర ఆటగాళ్లలో ఆడం గిల్‌క్రిస్ట్(Adam Gilchrist) ఒకడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన గిల్ క్రిస్ట్ ఆసీస్‌కు ఒంటిచేత్తో అందించిన విజయాలు అనేకం. 2007 ప్రపంచ కప్ ఫైనల్లో అతను చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. అయితే.. అంతకుముందు మ్యాచుల్లో అతడి ఫామ్ జట్టును కలవరపరిచింది. కానీ, కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) అతడిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. బార్బడోస్‌లోని కెన్సింగటన్ ఓవల్ మైదానంలో శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ క్రిస్ట్ కెప్టెన్ నమ్మకానికి నిలబెడుతూ వీరవిజృంభణ చేశాడు. 104 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 149 పరుగులు చేశాడు.
ఆడం గిల్‌క్రిస్ట్

వర్షం కారణంగా 38 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఆస్ట్రేలియా 53 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి జగజ్జేతగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న గిల్‌క్రిస్ట్.. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటికీ అతడి పేరు మీదే ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

