Jaspreet Bumrah : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన నాలుగో టెస్టుకు ఒక్క రోజే ఉంది. సిరీస్‌లో వెనకబడిన భారత జట్టుకు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఇది. సిరీస్‌ను సమం చేయాలంటే గెలవక తప్పని టెస్టులో జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఆకాశ్ దీప్ గాయంతో అందుబాటులో లేడు. ఇక ఏస్ పేసర్ బుమ్రా కూడా ఆడకుంటే పరిస్థితి ఏంటీ? అనే ప్రశ్నలు తలెత్తిన వేళ మహ్మద్ సిరాజ్ ఊహాగానాలకు తెరదించాడు. ఓల్డ్ ట్రఫోర్డు (Old Trafford) టెస్టు తుది జట్టులో బుమ్రా ఉండడం ఖాయమని చెప్పాడీ స్పీడ్‌స్టర్.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో నెట్స్‌లో చెమటోడ్చుతోంది. కీలకమైన ఈ టెస్టులో బుమ్రా ఆడడంపై కోచ్ గంభీర్ గానీ, కెప్టెన్ గిల్ గానీ నోరు మెదపడం లేదు. మ్యాచ్ విన్నర్ అయిన బుమ్రా ఈ మ్యాచ్ ఆడకుంటే ఇంగ్లండ్ లబ్ది పొందడం ఖాయం అనిపించింది. కానీ, జట్టుకు అవసరమైనప్పుడు నేనున్నానంటూ మైదానంలోకి దిగే యార్కర్ కింగ్ ఓల్డ్ ట్రఫోర్డ్‌లో అడేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఈ విషయాన్ని సిరాజ్ వెల్లడించాడు.
No uncertainty for Manchester: With the series on the line, Jasprit Bumrah will play says Mohammed Siraj
Read more: https://t.co/GyjfEJeq8N | #ENGvIND pic.twitter.com/duUzdtKHyK
— ESPNcricinfo (@ESPNcricinfo) July 21, 2025
‘సీనియర్ పేసర్ అయిన బుమ్రా కచ్చితంగా నాలుగో టెస్టు ఆడుతాడు. అందులో సందేహమే లేదు’ అని చెప్పాడీ పేస్ గన్. అయితే.. వరసగా అవకాశాలు ఇచ్చినా విఫలం అవుతున్న కరుణ్ నాయర్‌పై వేటు పడనుందని టాక్. అతడి బదులు సాయి సుదర్శన్ ఆడే అవకాశముంది. ఎడమ మోకాలి గాయంతో సిరీస్‌కు దూరమైన నితీశ్ రెడ్డి స్థానంలో శార్ధూల్ ఠాకూర్ తుది జట్టులోకి రావచ్చు.
భారత స్క్వాడ్ (నాలుగో టెస్టు కోసం) : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్వన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కంభోజ్.
బర్మింగ్హమ్లో సూపర్ విక్టరీతో లార్డ్స్‌కు వెళ్లిన భారత జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. బుమ్రా ఐదు వికెట్లతో రాణించినా.. జడేజా అద్భుతంగా పోరాడినా 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక మ్యాచ్‌ను అప్పగించింది. దాంతో, ఐదు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.