yellow board | మల్లాపూర్, జూలై 21: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన పసుపు బొర్డుతో ఇప్పటికీ ఏ రైతుకు లాభం చేకూరలేదని, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు పని గట్టుకోని చక్కెర కర్మాగారం పునరుద్ధరణ పేరిట పాదయాత్ర చేశారని మాజీ జడ్పీటీసీ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి అన్నారు.
మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నాయకులు నిర్వహించిన పాదయాత్రలో జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సరికావని, రైతుల సంక్షేమం కోసం సర్కార్ నిరంతరం పనిచేస్తుందని, రానున్న రోజుల్లో ముత్యంపేట చక్కెర కర్మాగారం యదావీదిగా ప్రారంభిస్తామాని స్పష్టం చేశారు. ఇక్కడ నాయకులు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి, అంతడుపుల నరసయ్య, నల్ల రాజన్న, బద్దం నర్సారెడ్డి, సిరిపురం రవీందర్, నూతిపల్లి రాజం, మర్రిపల్లి మల్లయ్య, సురేష్, కిరణ్, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.