Perth Test : పెర్త్ టెస్టులో పేసర్లకు అనుకూలించిన పిచ్ మీద కంగారూ బ్యాటర్లు తడబడ్డారు. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (4/17), మహ్మద్ సిరాజ్(2/17)ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను ఆలౌట్ అంచున నిలిపిన భారత జట్టు పట్టుబిగించింది. అయితే.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆటగాళ్ల కవ్వింపులు, గొడవలు లేకుండా జరగడం చాలా అరుదు.
తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో హైదరాబాదీ పేసర్ సిరాజ్, ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్(2)ల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. . దాంతో, కోపంతో ఊగిపోయిన విరాట్ కోహ్లీ బంతి తీసుకొని బెయిల్స్ పడేశాడు. ఇంతకూ ఏం జరిగిందంటే..?
That’s Stumps on what was an engrossing Day 1 of the 1st #AUSvIND Test!
7⃣ wickets in the Final Session for #TeamIndia! 👌👌
4⃣ wickets for Captain Jasprit Bumrah
2⃣ wickets for Mohammed Siraj
1⃣ wicket for debutant Harshit RanaScorecard ▶️ https://t.co/gTqS3UPruo pic.twitter.com/1Mbb6F6B2c
— BCCI (@BCCI) November 22, 2024
బుమ్రా ధాటికి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను మార్నస్ లబూషేన్(2) ఆదుకోవాలని అనుకున్నాడు. అయితే.. సిరాజ్ 13 ఓవర్లో వేసిన షార్ట్ లెగ్ బంతిని అతడు క్రీజు దాటొచ్చి డిఫెన్స్ చేయబోయాడు. కానీ, ఆ బంతి మిస్ అయి అతడి తొడకు తాకింది. అంతే.. బౌలింగ్ ఎండ్ నుంచి సిరాజ్ వేగంగా పరుగెత్తుకొచ్చి బంతిని కాలితో వికెట్లవైపు తన్నాడు. అది గమనించిన లబూషేన్ బ్యాటుతో బంతిని అడ్డుకున్నాడు. ఆసీస్ స్టార్ ఆటగాడి తీరుతో కోపం తెచ్చుకున్న సిరాజ్ .. ఇదేంటీ.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇదంతా చూస్తున్న విరాట్ కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. కోపంగా బంతితో బెయిల్స్‌ను పడేశాడు.
Things are heating up! Siraj and Labuschagne exchange a few words.#INDvsAUS pic.twitter.com/leKRuZi7Hi
— 彡Viя͢ʊs ᴛᴊ ᴘᴇᴛᴇʀ र (@TjPeter2599) November 22, 2024
తొలి టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయినప్పటికీ విజృంభణతో ఆస్ట్రేలియాను ఆలౌట్ ప్రమాదంలో పడేసింది. అనుకున్నట్టే పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించగా.. ఇరుజట్ల స్పీడ్స్టర్లు రెచ్చిపోయారు. ఇంకేముంది ఒక్కరోజే 17 వికెట్లు పడ్డాయి.
IPL Teammates to 𝐓𝐨𝐮𝐠𝐡𝐞𝐬𝐭 𝐑𝐢𝐯𝐚𝐥𝐬 🥶#NitishKumarReddy makes his mark in the #ToughestRivalry with a stunning six off his IPL captain, #PatCummins! 💥
Watch #AUSvINDonStar 👉 LIVE NOW on Star Sports 1! #ToughestRivalry pic.twitter.com/e529nA4YJx
— Star Sports (@StarSportsIndia) November 22, 2024
ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడిన చోట తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(41), వికెట్ కీపర్ రిషభ్ పంత్(37)లు అద్భుత పోరాటం కనబరిచారు. అనంతరం కంగారూ టాపార్డర్‌ను బుమ్రా(4/17) దెబ్బకొట్టాడు. అతడిని అనుసరిస్తూ మహ్మద్ సిరాజ్(2/17) కూడా విజృంభించడంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.