IND vs WI : రెండో టెస్టులోనూ ఆతిథ్య వెస్టిండీస్(westindies) జట్టు ఆట మారలేదు. భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌటయ్యింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆట మొదలైన గంటలోపే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్(mohammad siraj) 5 వికెట్లతో విండీస్‌ను దెబ్బ కొట్టాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సత్తా చాటిన ముకేశ్, సిరాజ్‌కు సహకారం అందించాడు. షానన్ గాబ్రియెల్‌ను సిరాజ్ ఎల్బీగా ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 183 ఆధిక్యం లభించింది.
నాలుగో రోజు క్రీజులోకి వచ్చిన అలిక్ అథనజే(37) ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో ఆరు పరుగులు జోడించాడంతే. ఆతర్వాత జేసన్ హోల్డర్(15)ను సిరాజ్ పెవిలియన్ పంపడంతో విండీస్ మరింత కష్టాల్లో పడింది. మొదట ఆడిన టీమిండియా 438 పరుగులకు ఆలౌటయ్యింది.
Innings Break!
Superb show with the ball from #TeamIndia to bowl out West Indies for 255 👌 👌
5⃣ wickets for @mdsirajofficial
2⃣ wickets each for @imjadeja & Mukesh Kumar
1⃣ wicket for @ashwinravi99Scorecard ▶️ https://t.co/d6oETzoH1Z#WIvIND pic.twitter.com/NCeJU3SK6p
— BCCI (@BCCI) July 23, 2023
విరాట్ కోహ్లీ(121) సెంచరీ కొట్టగా, యశస్వీ జైస్వాల్(57), రోహిత్ శర్మ(80), రవీంద్ర జడేజా(61), అశ్విన్(56) అర్ధ శతకాలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ మూడో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 229 రన్స్ కొట్టింది.