Ravi Dahiya | ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో ఒలింపిక్ విజేతకు చుక్కెదురు
Ravi Dahiya : ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత స్టార్ రెజ్లర్ రవి దహియా(Ravi Dahiya)కు ఆసియా కప్ ట్రయల్స్(Asian Games Trails 2023,)లో చుక్కెదురైంది. ఇందిరా గాంధీ స్టేడియంలో ఈరోజు జరిగిన 57 కిలోల బౌట్లో దహియా అనూహ్యంగా ఓడిపోయాడు. ఏమంత గొప్ప రికార్డు లేని మహారాష్ట్రకు చెందిన అతిశ్ తోడ్కర్(Atish Todkar) చేతిలో కంగు తిన్నాడు. దాంతో, మ్యాట్ మీద చురుకుగా...
Ravi Dahiya : ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత స్టార్ రెజ్లర్ రవి దహియా(Ravi Dahiya)కు ఆసియా కప్ ట్రయల్స్(Asian Games Trails 2023,)లో చుక్కెదురైంది. ఇందిరా గాంధీ స్టేడియంలో ఈరోజు జరిగిన 57 కిలోల బౌట్లో దహియా అనూహ్యంగా ఓడిపోయాడు. ఏమంత గొప్ప రికార్డు లేని మహారాష్ట్రకు చెందిన అతిశ్ తోడ్కర్(Atish Todkar) చేతిలో కంగు తిన్నాడు. దాంతో, మ్యాట్ మీద చురుకుగా కదులుతూ ప్రత్యర్థి భరతం పట్టే రవి దహియా ఆశ్చర్యకర రీతిలో ఇంటిబాట పట్టాడు. దహియా ఆట, అతడి బలాబలాలా మీద అవగాహన ఉన్న అతిశ్ బరిలో ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 20-8 పాయింట్లతో పూర్తి ఆధిపత్యం కనబరిచాడు.
టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో రవి దహియా 57 కిలోల విభాగంలో వెండి పతకం సాధించాడు. బర్మింగ్హమ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games 2022)లో స్వర్ణం సాధించాడు. అయితే.. తరచూ గాయాలు వేధిస్తుండడంతో అతను ఈ ఏడాది పలు పోటీల్లో పాల్గొనలేదు. కుడి మోకాలులో యాంటెరియర్ క్రుసికేట్ లిగమెంట్(ACL), మీడియల్ కొల్లాటెరల్ లిగమెంట్(MCL) దెబ్బ తినడంతో మ్యాట్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో, ఆటపై పట్టు కోల్పోయాడు.
రవి దహియా

ట్రయల్స్‌లో మునపటి వేగం చూపించలేకపోయాడు. అతీశ్ చేతిలో చిత్తుగా ఓడడం దహియా ఫిట్‌నెస్‌పై పలు సందేహాల్ని కలిగిస్తోంది. అయితే.. అతను మాత్రం అవన్నీ కొట్టిపారుస్తున్నాడు. వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్(Parris Olympics 2024)లో స్వర్ణ పతకమే తన లక్ష్యమని చెప్తున్నాడు.
ఇవి కూడా చదవండి
Korea Open 2023 | వరల్డ్ నంబర్ 1 జోడీకి షాకిచ్చి.. టైటిల్ విజేతగా నిలిచిన సాత్విక్ – చిరాగ్ జోడీ
Harmanpreet Kaur | మిస్ కూల్ కెప్టెన్‌కు భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

