Harmanpreet Kaur | మిస్ కూల్ కెప్టెన్‌కు భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)కు భారీ షాక్ తగిలింది. మిస్ కూల్ కెప్టెన్‌గా పేరొందని ఆమెకు మ్యాచ్ ఫీజులో ఏకంగా 75 శాతం జరిమానా పడింది. బంగ్లాదేశ్‌తో టైగా ముగిసిన మూడో వన్డే(Third ODI)లో ఆమె అంపైర్ నిర్ణయంతో విభేదించడమే కాకుండా కోపంగా బ్యాట్‌ను వికెట్లకేసి కొట్టడమే అందుకు కారణం. దాంతో, మ్యాచ్ ఆఫీషియల్ భారత కెప్టెన్ తీరును....
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)కు భారీ షాక్ తగిలింది. మిస్ కూల్ కెప్టెన్‌గా పేరొందని ఆమెకు మ్యాచ్ ఫీజులో ఏకంగా 75 శాతం జరిమానా పడింది. బంగ్లాదేశ్(Bangladesh)తో టైగా ముగిసిన మూడో వన్డే(Third ODI)లో ఆమె అంపైర్ నిర్ణయంతో విభేదించడమే కాకుండా కోపంగా బ్యాట్‌ను వికెట్లకేసి కొట్టడమే అందుకు కారణం. దాంతో, మ్యాచ్ ఆఫీషియల్ భారత కెప్టెన్ తీరును లెవల్ 2 నేరంగా పరిగణించాడు. అందుకుని ఆమెకు 75 శాతం ఫైన్‌తో పాటు నాలుగు డీమెరిట్ పాయింట్లు(demerit points) కేటాయించాడు.
‘మైదానంలో (వికెట్లను బ్యాట్‌తో కొట్టడం) అలా ప్రవర్తించినందుకు హర్మన్‌ప్రీత్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం, అలాగే సిరీస్ ప్రదాన కార్యక్రమంలో అంపైర్లను తప్పుపట్టినందుకు మరో 25 శాతం ఫైన్ విధించాం. దురుసు ప్రవర్తనకు గానూ 3, ప్రజెంటేషన్ సమయంలో అలా మాట్లాడినందుకు ఒక డీమెరిట్ పాయింట్లు కేటాయించాం’ అని మ్యాచ్ అధికారి క్రిక్‌బజ్(Cricbuzz)తో చెప్పాడు.
బ్యాట్‌తో వికెట్లను కొడుతున్న హర్మన్‌ప్రీత్

మూడో వన్డేలో 225 పరుగుల లక్ష్య ఛేదనలో యస్తికా భాటియా(4) ఔటయ్యాక హర్మన్‌ప్రీత్ క్రీజులోకి వచ్చింది. అయితే.. స్మృతి మంధాన(59)తో కలిసి జాగ్రత్తగా ఆడింది. అయితే.. 21 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమెను అంపైర్ తన్వీర్ అహ్మద్(Tanvir Ahmed) ఎల్బీగా ఔటిచ్చాడు. అయితే.. అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న భారత కెప్టెన్ కోపంతో వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. పెవిలియన్‌కు వెళ్తూ అంపైర్‌ను దూషించింది కూడా. అంతటితో ఆ విషయాన్ని విడిచిపెట్టలేదు. సిరీస్ ప్రజెంటేషన్ సమయంలో కూడా హర్మన్‌ప్రీత్ అంపైర్ల తప్పిదాలపై మాట్లాడింది. మళ్లీ బంగ్లాకు వచ్చినప్పుడు అంపైర్ల తప్పిదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పింది.
డియోల్, రోడ్రిగ్స్ పోరాడినా..
భారీ లక్ష్య ఛేదనలో.. హర్లీన్ డియోల్(77), జెమీమా రోడ్రిగ్స్(33 నాటౌట్) పోరాడడంతో భారత జట్టు గెలుపు వాకిట నిలిచింది. అయితే.. చివరి వికెట్‌గా మేఘనా సింగ్ (6) ఔట్ కావడంతో 225 పరుగుల వద్ద భారత జట్టు ఆలౌటయ్యింది. దాంతో, ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. కానీ, వర్షం కారణంగా అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించకుండానే భారత్, బంగ్లాదేశ్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
Lahiru Thirimanne | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక వరల్డ్ కప్ హీరో
Ambati Rayudu | ధోనీ వారసుడు అతడే!.. హింట్ ఇచ్చిన అంబటి రాయుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

