Korea Open 2023 | వరల్డ్ నంబర్ 1 జోడీకి షాకిచ్చి.. టైటిల్ విజేతగా నిలిచిన సాత్విక్ – చిరాగ్ జోడీ
Korea Open 2023 : భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj)-చిరాగ్ శెట్టి(Chirag Shetty) సంచలనం సృష్టించారు. ప్రతిష్టాత్మక కొరియా ఓపెన్ పురుషుల డబుల్స్ చాంపియన్‌గా నిలిచారు. ఈరోజు జరిగిన ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియన్(Fajar Alfian), ముహమ్మద్ రియాన్(Muhammad Rian) జోడీని...
Korea Open 2023 : భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj)-చిరాగ్ శెట్టి(Chirag Shetty) సంచలనం సృష్టించారు. ప్రతిష్టాత్మక కొరియా ఓపెన్ పురుషుల డబుల్స్ చాంపియన్‌గా నిలిచారు. ఈరోజు జరిగిన ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియన్(Fajar Alfian), ముహమ్మద్ రియాన్(Muhammad Rian) జోడీని చిత్తు చేశారు. హోరాహోరీ పోరులో వరల్డ్ నంబర్ 1 జంటను 17-21, 21-13, 21-14తో సాత్విక్ – చిరాగ్ ఓడించారు. దాంతో ఈ ఏడాది మూడో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్(BWF World Tour) సూపర్-500 టోర్నీ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా ఏడో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్.
సెమీఫైనల్లో రెండో సీడ్ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ జోడీకి షాకిచ్చిన సాత్విక్ – చిరాగ్ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించారు. టాప్ సీడ్లకు చుక్కలు చూపించి ట్రోఫీ విజేతగా నిలిచారు. ఒకదశలో 9-8తో భారత ద్వయం వెనుకబడింది. కానీ, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని తొలి సెట్ గెలుకుచుకుంది. రెండో సెట్లో ఫజర్, రియాన్ నుంచి గట్టిపోటీ ఎదురైనంది. అయినా కూడా సాత్విక్ – చిరాగ్ పట్టువిడవకుండా పోరాడి పైచేయి సాధింంచింది. అదే ఉపులో ఆఖరి సెట్ గెలిచి 40 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. ఈ మధ్యే సాత్విక్ – చిరాగ్ జోడీ ఇండోనేషియా ఓపెన్(Indonasia Open) టైటిల్ సాధించిన విషయం తెలిసిందే.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🤩
Satwik-Chirag win their 3️⃣rd #BWFWorldTour Super 500 title 🥳
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/t0osXuHCFS
— BAI Media (@BAI_Media) July 23, 2023
వరల్డ్ టూర్ ఫైనల్లో రికార్డు
సాత్విక్ – చిరాగ్ ద్వయానికి వరల్డ్ టూర్ ఫైనల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ తొమ్మిది సార్లు ఫైనల్ చేరిన ఈ జోడీ ఏకంగా ఏడు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచింది. ఈ జోడీ తొలిసారిగా ఇండోనేషియా సూపర్ 1000 టోర్నమెంట్ టైటిల్ సాధించింది. అంతేకాదు హైదరాబాద్ ఓపెన్(2018), థాయ్‌లాండ్ ఓపెన్(2019), ఫ్రెంచ్ ఓపెన్(2022) డబుల్స్ విజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
Harmanpreet Kaur | మిస్ కూల్ కెప్టెన్‌కు భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా
Lahiru Thirimanne | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక వరల్డ్ కప్ హీరో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

