Rafael Nadal | మెస్సీ, రొనాల్డో.. ఈ ఇద్దరిలో ఎవరు గ్రేట్?.. టెన్నిస్ దిగ్గజం సమాధానం ఇదే..!
Rafael Nadal : ఫుట్‌బాల్ ఆటలో లియోనల్ మెస్సీ(Lionel Messi), క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఇద్దరూ దిగ్గజాలే. సమకాలీనులైన వీళ్లను ఒకరితో ఒకరిని పోల్చలేం. ఇద్దరూ తమ మార్క్ ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే.. వీళ్లలో ఎవరు గ్రేట్? అనే ప్రశ్నకు టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్(Rafael Nadal) ఏమాత్రం తటపటాయించకుండా తన దృష్టిలో రొనాల్డో కంటే...
Rafael Nadal : ఫుట్‌బాల్ ఆటలో లియోనల్ మెస్సీ(Lionel Messi), క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఇద్దరూ దిగ్గజాలే. సమకాలీనులైన వీళ్లను ఒకరితో ఒకరిని పోల్చలేం. ఇద్దరూ తమ మార్క్ ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే.. వీళ్లలో ఎవరు గ్రేట్? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. కొన్నాళ్లుగా మెస్సీ, రొనాల్డో అభిమానుల్లో ఇదే విషయమై వివాదం నడుస్తోంది. తాజాగా టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్(Rafael Nadal)కు ఇదే ప్రశ్న ఎదురైంది. అతను ఏమాత్రం తటపటాయించకుండా తన దృష్టిలో రొనాల్డో కంటే మెస్సీనే గొప్ప ఆటగాడు అని చెప్పేశాడు.
ప్రస్తుతం గ్రీస్ పర్యటనలో ఉన్న రఫా.. ‘మెస్సీ గొప్ప ప్లేయర్. కానీ, నేను రియల్ మాడ్రిడ్(Real Madrid) వీరాభిమానిని’ అని ఒక వీడియోలో అన్నాడు. ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. మెస్సీ ఈమధ్యే అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అంతేకాదు నిన్న తొలి గోల్ కొట్టి జట్టును గెలిపించాడు. ఫిఫా వరల్డ్ కప్ తర్వాత రొనాల్డో సౌదీ అరేబియా అల్ నసీర్(Al Nassr) క్లబ్‌కు మారిన విషయం తెలిసిందే.
While on holiday in Greece, Rafael Nadal says Messi is better than Ronaldo 🤝⚽ pic.twitter.com/kwZkpgsMrq
— Luigi Gatto (@gigicat7_) July 23, 2023
నాదల్ చిన్పప్పటి నుంచి రియల్ మాడ్రిడ్(Real Madrid) క్లబ్ ఫ్యాన్. అందుకు కారణం ఏంటంటే.. అతడి మామ మిగుల్ అంగెల్ (Miguel Angel Nadal) గతంలో బార్సిలోనా(Barcelona) క్లబ్‌కు ఆడాడు. అంతేకాదు మెస్సీ, రొనాల్డో చాలారోజులు బార్సిలోనా, రియల్ మాడ్రిడ్ క్లబ్స్‌కు ఆడారు. దాంతో, ఈ ఇద్దరి ఆటంటే నాదల్కు బాగా ఇష్టం. క్లే కోర్టు కింగ్‌గా వెలుగొందిన నాదల్ ఖాతాలో 22 గ్రాండ్‌స్లామ్స్ ఉన్నాయి.
రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్

తొడ కండరాల గాయం కారణంగా ఈ మాజీ వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ కొన్నాళ్లుగా ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతను రాకెట్ పట్టేందుకు మరింత సమయం పట్టనుంది. సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(novak djokovic) 23 గ్రాండ్‌స్లామ్స్‌తో నాదల్ రికార్డు బద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జకో, కార్లోస్ అల్కరాజ్ను ఓడించి టైటిల్ సాధించాడు. దాంతో, పురుషుల సింగిల్స్‌లో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
Ravi Dahiya | ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో ఒలింపిక్ విజేతకు చుక్కెదురు
Korea Open 2023 | వరల్డ్ నంబర్ 1 జోడీకి షాకిచ్చి.. టైటిల్ విజేతగా నిలిచిన సాత్విక్ – చిరాగ్ జోడీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

