China Masters : ఈ సీజన్లో టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు(PV Sindhu) చైనా మాస్టర్స్(China Masters)లో ముందంజ వేసింది. 32వ రౌండ్లో జూలీ దవాల్ జకొబ్సెన్(Julie Dawall Jakobsen)ను మట్టికరిపించింది. టాప్ గేర్‌లో ఆడిన భారత షట్లర్ కేవలం 27 నిమిషాల్లోనే డెన్మార్క్ ప్లేయర్‌ను చిత్తు చేసింది. అయితే.. పురుషుల సింగిల్స్‌లో యువకెరటం ఆయుశ్ శెట్టి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత షట్లర్లకు చుక్కెదురైంది.
హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సింధు ఆ ఓటమి నుంచి తేరుకుని చైనా మాస్టర్స్‌లో విజృంభించింది. డెన్మార్క్ షట్లర్ జకొబ్సెన్ను వణికిస్తూ పది నిమిషాల్లోనే 21-4తో తొలి సెట్ కైవసం చేసుకుంది. భారీ తేడాతో గెలుపొందిన ఒలింపిక్ విజేత మ్యాచ్‌ను మరో 17 నిమిషాల్లోనే ముగించింది. రెండో సెట్లోనూ జోరు చూపించిన సింధు.. 21-10తో ప్రత్యర్థిని ఓడించింది. 16వ రౌండ్లో పొర్న్‌పవీ చొచువాంగ్(థాయ్‌లాండ్)ను ఢీకొననుందీ ఒలింపిక్ విజేత.
PV Sindhu advanced to the Round of 16 at the Li-Ning China Masters 2025 with a straight-games victory over Denmark’s Julie Dawall Jakobsen, winning 21-5, 21-10 in just 27 minutes. She will next face sixth seed Pornpawee Chochuwong of Thailand.
In men’s singles, youngster Ayush… pic.twitter.com/KKJBJbA3eY
— RevSportz Global (@RevSportzGlobal) September 16, 2025
ఇక.. కుర్రాడు ఆయుశ్ శెట్టి తొలి రౌండ్లోనే చైనీస్ తైపీ ఆటగాడు చౌ థియెన్ చెన్ చేతిలో కంగుతిన్నాడు. తొలి సెట్ కోల్పోయిన ఆయుశ్ రెండో సెట్ గెలుపొందాడు. కానీ, నిర్ణయాత్మక మూడో సెట్లో చెన్ ధాటికి చేతులెత్తేశాడు. మిక్స్డ్ డబుల్స్‌లో రుత్వికా గడ్డె, రోహన్ కపూర్ నిరాశపరిచారు. జపాన్ ద్వయం యుచీ షిమోగామి – సయకా హొబరా చేతిలో 17-21, 11-21తో ఓడిపోయారు.
హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ (Hong Kong Open) తొలి రౌండ్లోనే సింధు ఓటమి పాలైంది. డెన్మార్క్‌కు చెందిన లినే క్రిస్టోఫెర్సెన్ చేతిలో భారత షట్లర్ అనూహ్యంగా కంగుతిన్నది. గతంలో లినేను ఐదుసార్లు చిత్తు చేసిన భారత స్టార్ ఈసారి మాత్రం చేతులెత్తేసింది.