Asia Cup | పాక్ మాజీ కెప్టెన్ యూనస్ నోటితీట..! సూర్యకుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు..
Asia Cup | ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియాపై ఓటమి.. మాజీ ఆటగాళ్లకు సైతం మింగుపడడం లేదు. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో కరచాలనం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో పలువురు మాజీ ఆటగాళ్లు తమ నోటికి పని చెబుతున్నారు.
Asia Cup | ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియాపై ఓటమి.. మాజీ ఆటగాళ్లకు సైతం మింగుపడడం లేదు. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో కరచాలనం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో పలువురు మాజీ ఆటగాళ్లు తమ నోటికి పని చెబుతున్నారు. మ్యాచ్ తర్వాత పాక్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ యూసుఫ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఛానల్ ‘సమా టీవీ’లో డిబేట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌పై అభ్యంతరంగా మాట్లాడాడు. టీవీ యాంకర్ అలా అనకూడదంటూ అభ్యంతరం చెప్పగా.. అక్కడున్న వారంతా నవ్వడం కనిపించింది. ఈ మ్యాచ్ భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్లతో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్‌లో సిక్సర్ కొట్టిన అనంతరం సూర్య కుమార్ యాదవ్.. మ్యాచ్ ముగిసిన వెంటనే శివం దుబేతో కలిసి నేరుగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేయడానికి మైదానంలో ఉండగానే భారత జట్టు తమ డ్రెస్సింగ్ రూమ్ తలుపును మూసివేయడం కనిపించింది.
A low level rhetoric from Yousuf Yohana (converted) on a national TV program.
He called India captain Suryakumar Yadav as “Suar” (pig).
Shameless behaviour. And they demand respect, preach morality. pic.twitter.com/yhWhnwaYYq
— Slogger (@kirikraja) September 16, 2025
టీవీ చర్చలో పాల్గొన్న యూసఫ్ మాట్లాడుతూ ‘ఈ **** కుమార్, భారత్‌ను చూడండి. వారు సిగ్గుపడాలి. అంపైర్‌ను వెంటబెట్టుకొని, రిఫరీని హింసించడం ద్వారా గెలువడానికి ప్రయత్నిస్తున్న తీరును చూడండి. అంపైర్‌ను మీరు చూడండి. అతను అవుట్ ఇవ్వడానికి వేలు కూడా ఎత్తడు’ అంటూ నోటికి వచ్చినట్లుగా వాగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారత అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మాజీ కెప్టెన్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మతో కలిసి 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసియా కప్‌లో భారత జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 15.5 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టపోయి గెలిచింది. రెండు వరుస విజయాలతో టీమిండియా సూపర్-4కు చేరుకుంది. పాక్ సూపర్-4కు చేరాలంటే.. యూఏఈపై గెలవాల్సి ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

