భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 16 : ఫ్లెక్సీ ఇండస్ట్రీ పై మెటీరియల్, కలర్స్, ముడి సరుకులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజులు ఫ్లెక్సీ షాపులు బంద్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వల్లందాస్ మహేష్, బోయిని పరమేష్ యాదవ్ తెలిపారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఫ్లెక్సీ షాపులు బంద్ ప్రకటిస్తూ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీఎస్టీ పెంచడం వల్ల ఇండస్ట్రీపై మోయలేని భారం పడుతుందని, దీనిపై ఆధారపడిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర అసోసియేషన్, జిల్లా ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ రెండు రోజుల పాటు ఫ్లెక్సీ షాపులు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ ఇండస్ట్రీ పై జీఎస్టీని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.