భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 16 : ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్ నార్సింగ్‌లో నిర్వహించే ఫొటో ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భోగ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఫొటో ఎక్స్పో పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంగళవారం పట్టణ కేంద్రంలో మండల ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఫొటోగ్రాఫర్ సంక్షేమ సంఘం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ఫొటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దోరనాల గణేష్, జిల్లా కార్యవర్గ సలహాదారుడు రచ్చ వెంకటేష్, కార్యవర్గ సభ్యుడు చింతల రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు గుద్దేటి పాండు, మండల ఉపాధ్యక్షుడు సీత శ్రవణ్, కేమ విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి మక్తల కృష్ణ, సహాయ కార్యదర్శి మాచర్ల కృష్ణానంద, కోశాధికారి రవ్వ నవీన్, కార్యవర్గ సభ్యులు సకినాల సిద్దేశ్వర, పెరమండ్ల అశోక్, ఏరవల స్వామి, చెరుపెల్లి గణేష్ పాల్గొన్నారు.