Zimbabwe Squad : డబ్ల్యూటీసీ సీజన్లో జింబాబ్వే (Zimbabwe) మరో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఈమధ్యే ఛాంపియన్ దక్షిణాఫ్రికా చేతిలో చావుదెబ్బ తిన్నఆ జట్టు తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్ (Newzealand)ను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో సోమవారం జింబాబ్వే సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. రెండు టెస్టుల సిరీస్ కోసం క్రెగ్ ఇర్విన్ కెప్టెన్‌గా 16 మందిని ఎంపిక చేశారు. సీనియర్లు సికిందర్ రజా (Sikinder Raza), గాయం నుంచి కోలుకున్న బెన్ కర్రాన్‌లు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
సఫారీలతో రెండు టెస్టులకు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో నలుగురిని పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. పటిష్టమైన న్యూజిలాండ్‌కు పోటీ ఇవ్వాలంటే గట్టి జట్టునే పంపాలి కాబట్టి సీనియర్లకు ప్రాధాన్యమిచ్చారు. రాయ్ కియా, మకొనితో పాటు కైతనో, ప్రిన్స్ మస్వరే, వెస్లేలు రెండు టెస్టుల సిరీస్‌తో జట్టులోకి వచ్చారు.
Zimbabwe name squad for Test series against New Zealand
Details 🔽https://t.co/P5vrDKPMXK pic.twitter.com/MzOslIgYHF
— Zimbabwe Cricket (@ZimCricketv) July 21, 2025
జింబాబ్వే స్క్వాడ్ : క్రెగ్ ఇర్విన్ (కెప్టెన్), సికందర్ రజా, సీన్ విలియమ్స్. బ్రియాన్ బెన్నెట్, తనకా చివంగా, బెన్ కర్రాన్, ట్రెవొర్ వాండు, రాయ్ కియా, తనున్రువ మకొని, క్లైవ్ మదండె, వినసెంట్ మసీకెసా, వెల్లింగ్టన్ మజకద్జ, బ్లెస్సింగ్ ముజరబని, న్యూమాన్ యహురి, , తఫడ్వా త్సిగా, నికోలసన్ వెల్చ్,
న్యూజిలాండ్, జింబాబ్వేల మధ్య తొలి టెస్టు క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జూలై 30న జరుగనుంది. ఇదే మైదానంలో రెండో టెస్టు ఆగస్ట్ 7న మొదలవ్వనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కివీస్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా శ్రీలంక రెండు, ఇంగ్లండ్ మూడు, భారత్ నాలుగు స్థానాల్లో నిలిచాయి.