గువహతి : ఫిబ్రవరి 11-16 మధ్య చైనాలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ షట్లర్ పీవీ సింధు గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది.