ముల్లాన్‌పూర్: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో.. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఓడిన విషయం తెలిసిందే. 20 రన్స్ తేడాతో ముంబై చేతిలో శుభమన్ గిల్ టీమ్ పరాజయాన్ని చవిచూసింది. 229 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్.. తీవ్రంగా పోరాడింది. ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. గుజరాత్ ఓటమిని తట్టుకోలేని అభిమానులు స్టేడియంలోనే ఏడ్చేశారు. ఆ లిస్టులో టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ సోదరి కూడా ఉన్నారు. ప్రేక్షుకుల గ్యాలరీలో ఉన్న ఆమె .. తన సోదరుడి జట్టు ఓడిపోవడంతో నిరాశకు లోనైంది. దీంతో ఆమె భావోద్వేగానికి గురై.. కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. గుజరాత్ జట్టు కోచ్ ఆశిష్ నెహ్రా కుమారుడు కూడా ఓటమి తట్టుకోలేక ఏడ్చేశాడు.
𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 effort on a 𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 occasion 💙@mipaltan seal the #Eliminator with a collective team performance ✌
Scorecard ▶ https://t.co/R4RTzjQNeP#TATAIPL | #GTvMI | #TheLastMile pic.twitter.com/cJzBLVs8uM
— IndianPremierLeague (@IPL) May 30, 2025
ముంబై జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తొలుత రోహిత్‌శర్మ(50 బంతుల్లో 81, 9ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీతో కదంతొక్కగా, బెయిర్‌స్టో(47), సూర్యకుమార్(33), తిలక్శర్మ(25) రాణించడంతో 20 ఓవర్లలో 228/5 స్కోరు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ(2/53), సాయికిషోర్(2/42) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 208/6 స్కోరుకు పరిమితమైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 80, 10ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేయగా, సుందర్(48) ఆకట్టుకున్నాడు. బౌల్ట్ (2/56) రెండు వికెట్లు తీయగా, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని ఒక్కో వికెట్ తీశారు.
Read More..