బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ క్రికెట్లో హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ అరంగేట్రం అదిరిపోయింది. ఇంగ్లండ్ క్రికెట్‌కు కొత్త జోష్ తీసుకొస్తూ వెస్టిండీస్‌తో తొలి వన్డేలో పరుగుల వరద పారించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 238 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 400/8 భారీ స్కోరు సాధించింది. మొదటి ఏడుగురు బ్యాటర్లు 35 అంతకంటే పరుగులు నమోదు చేసి వన్డే క్రికెట్లో కొత్త రికార్డు నెలకొల్పారు. సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడిన జాకబ్ బెతెల్(53 బంతుల్లో 82, 8ఫోర్లు, 5సిక్స్‌లు), డకెట్(48 బంతుల్లో 60, 6ఫోర్లు, సిక్స్), హ్యారీ బ్రూక్(58), రూట్(57) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. పసలేని విండీస్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ పరుగులు కొల్లగొట్టారు. భారీ లక్ష్యఛేదనకు దిగిన విండీస్ 26.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాయి హోప్(25) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. సకీబ్ మహమూద్(3/32), ఓవర్టన్(3/22) ధాటికి విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ ఇంగ్లండ్‌కు పోటీనివ్వలేకపోయింది. బెతెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.