మొహాలీ: భారత క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill) ఔదార్యాన్ని ప్రదర్శించారు. మొహాలీలో ఉన్న ఫేజ్ 4 సివిల్ హాస్పిటల్‌కు మెడికల్ పరికరాలను డోనేట్ చేశారు. సుమారు 35 లక్షల ఖరీదైన హెల్త్‌కేర్ ఎక్విప్మెంట్ను శుభమన్ అందజేసినట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులీటీ(సీఎస్ఆర్) ప్రోగ్రామ్‌లో భాగంగా క్రికెటర్ శుభమన్ సీక్రెట్‌గా ఆ డొనేషన్ చేశారు. ఆ ప్రాంతంలో వైద్య సేవల్ని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గిల్ ఆ ఛారిటీలో పాల్గొన్నారు.
విరాళం ఇచ్చిన ఎక్విప్‌మెంట్‌లో వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు, సీలింగ లైట్లు, సిరంజి పంపులు, ఎక్స్ రే మెషీన్లు ఉన్నట్లు సివిల్ సర్జన్ డాక్టర్ సంగీత జైన్ తెలిపారు. ఆస్పత్రికి విరాళం అందజేసిన గిల్‌కు ఆ డాక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్ రిక్వైర్మెంట్ను బట్టి .. ఆ ఎక్విప్మెంట్ను కేటాయించనున్నట్లు ఆమె చెప్పారు. మొహాలీ పట్టణంతో గిల్‌కు అనుబంధం ఉంది. ఆ సిటీలోనే అతను క్రికెట్ శిక్షణ పొందాడు. ప్రస్తుతం అక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు.