గువహతి: దక్షిణాఫ్రికాతో శనివారం నుంచి మొదులకాబోయే రెండో టెస్టులో భారత సారథి శుభ్మన్ గిల్ ఆడతాడా? లేదా? అన్నది శుక్రవారం తేలనుంది. మెడ గాయం నుంచి కోలుకుంటున్న గిల్.. నేడు ఫిట్నెస్ టెస్టుకు హాజరవనున్నాడు. భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.‘గిల్ రెండో టెస్టులో ఆడాలని మా జట్టు కోరుకుంటున్నది.
గాయం నుంచి అతడు కోలుకుంటున్నాడు. అయితే గువహతిలో అతడి ప్రాతినిథ్యంపై శుక్రవారం సాయంత్రం తుది నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ అతడు దూరమైతే కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లూ మాకు ఉన్నారు’ అని చెప్పాడు. గిల్ గైర్హాజరీలో పంత్ రెండో టెస్టులోనూ స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఉండనున్నాడు.