Shubman Gill : భారత జట్టు భావి సారథిగా అభివర్ణించబడుతున్న శుభ్‌మన్ గిల్(Shubman Gill) సొంతగడ్డపై నిరాశ పరిచాడు. బంగ్లాదేశ్‌తో చెపాక్‌లో జరుగుతున్న తొలి టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరి చెత్త రికార్డు మూట గట్టకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఏడాది గిల్ డకౌట్(Duck Out) అవ్వడం ఇది మూడోసారి. తద్వారా ఈ ఏడాది అత్యధిక సార్లు సున్నా చుట్టేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ చేరాడు. పాకిస్థాన్ ఆటగాడు అబ్దుల్లా షఫిక్ (Abdullah Shafique) మూడు కంటే ఎక్కువ డకౌట్లతో గిల్ కంటే ముందున్నాడు.
టీ20ల్లో దుమ్మురేపుతున్న యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) టెస్టుల్లోనూ ఓపెనర్‌గా స్థిరపడడంతో శుభ్‌మన్ గిల్ ఆర్డర్ మారాల్సి వచ్చింది. ‘నయావాల్’ ఛతేశ్వర్ పూజారా స్థానంలో ఆడుతున్న అతడిపై భారీ అంచనాలు ఉంటున్నాయి. అయితే.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ సిరీస్‌లో సెంచరీతో మెరిసిన గిల్ ఆ తర్వాత మెప్పించలేకపోయాడు.
Shubman Gill 0(8) vs Bangladesh 1st Test 2024
Ball by ball highlights pic.twitter.com/EOLYElxlxP
— Naeem (@Naeemception) September 19, 2024
తాజాగా బంగ్లాదేశ్‌పై చెపాక్‌లో రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్ పేలవమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దాంతో, ఓ చక్కని ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని చేజేతులా నేలపాలు చేసుకున్నాడు. స్వదేశంలో మూడో స్థానంలో ఆడి.. గిల్ కంటే ఎక్కువ సార్లు డకౌట్ అయిన భారత క్రికెటర్లు ఎవరంటే..?
1. ఛతేశ్వర్ పూజారా – ఐదు సార్లు (70 ఇన్నింగ్స్‌లు)
2. దిలీప్ వెంగ్‌సర్కార్ – నాలుగు సార్లు (32 ఇన్నింగ్స్‌లు)
3. శుభ్‌మన్ గిల్ – మూడు సార్లు (11 ఇన్నింగ్స్‌లు)
4. రాహుల్ ద్రవిడ్ – మూడు సార్లు (96 ఇన్నింగ్స్‌లు)
5. పాలీ ఉమ్రిగర్ – మూడు సార్లు (26 ఇన్నింగ్స్‌లు)
6. మొహిందర్ అమర్నాథ్ – మూడుసార్లు (28 ఇన్నింగ్స్‌లు)