Honor 200 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ 200 లైట్ 5జీ (Honor Lite 5G) ఫోన్ ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 108 – మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్, 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 35 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జర్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 8.0 వర్షన్ పై పని చేస్తుంది. యూజర్ ఎక్స్‌పీరియెన్స్ పెంచడానికి పలు ఏఐ ఫీచర్లు అందిస్తుంది. గత జూలైలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లతో హానర్ 200 లైట్ 5జీ ఫోన్ జత కలుస్తుంది.
హానర్ 200 లైట్ 5జీ (Honor 200 Lite 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 పలుకుతుంది. ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. హానర్ ఇండియా వెబ్ సైట్, సెలెక్టెడ్ మెయిన్ స్టోర్లలో లభిస్తాయి.
హానర్ 200 లైట్ 5జీ (Honor 200 Lite 5G) ఫోన్‌ను ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.200 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే హానర్ 200 లైట్ 5జీ ఫోన్ రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందుగా ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటల నుంచే హానర్ 200 లైట్ 5జీ ఫోన్ పై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సియాన్ లేక్, మిడ్ నైట్ బ్లాక్, స్టారీ బ్లూ రంగుల్లో ఫోన్ లభిస్తుంది.
హానర్ 200 లైట్ 5జీ ఫోన్ 3240 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2412×1080 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. 8 జీబీ ర్యామ్ వర్చువల్ గా మరో 8 జీబీ పెంచుకోవచ్చు. మ్యాజిక్ ఎల్ఎం, మ్యాజిక్ పోర్టల్, మ్యాజిక్ కాప్స్యూల్, మాజిక్ లాక్ స్క్రీన్, పార్లల్ స్పేసెస్ తదితర ఏఐ ఫీచర్లు ఉంటాయి. గత జనవరిలో ఆవిష్కరించిన ఫోర్ లేయర్డ్ ఏఐ ఆర్కిటెక్చర్ తో కూడిన న్యూ ఓఎస్‌ను హానర్ ప్రవేశ పెట్టింది.
35వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో హానర్ 200 లైట్ 5జీ ఫోన్ 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.1, ఓటీజీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 5-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.