Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వెల్లడించిన ఎన్నికల మ్యానిఫెస్టో కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు కాపీ పేస్ట్‌లా ఉందని హరియాణ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా ఎద్దేవా చేశారు. క్షేత్రస్ధాయిలో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి అనూహ్య మద్దతు లభిస్తోందని అన్నారు. భూపీందర్ హుడా గురువారం జింద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పాలక బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా అంతకుముందు ధీమా వ్యక్తం చేశారు. హరియాణ ప్రజలు కాషాయ సర్కార్‌ను సాగనంపి కాంగ్రెస్ సర్కార్‌కు పట్టం కట్టనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని, ప్రజలు మార్పు కోరుతున్నారని స్పష్టం చేశారు. కాగా, హరియాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఏడు గ్యారంటీలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
Read More :
Gmail | ఈ పని చేయకుంటే జీమెయిల్ అకౌంట్ డిలీట్.. రేపటి వరకే ఆఖరి ఛాన్స్..!