Gmail | ఈ పని చేయకుంటే జీమెయిల్ అకౌంట్ డిలీట్.. రేపటి వరకే ఆఖరి ఛాన్స్..!
Gmail | జీమెయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది జనం జీమెయిల్ని వినియోగిస్తున్నారు. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం నేపథ్యంలో జీమెయిల్ కూడా తప్పనిసరిగా మారింది.
Gmail | జీమెయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది జనం జీమెయిల్ని వినియోగిస్తున్నారు. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం నేపథ్యంలో జీమెయిల్ కూడా తప్పనిసరిగా మారింది. విద్యార్థుల నుంచి బడా వ్యాపారవేత్తలకు తప్పనిసరిగా జీమెయిల్ అకౌంట్ ఉన్నది. అయితే, గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో లక్షల సంఖ్యల్లో జీమెయిల్ అకౌంట్స్‌ను డిలీట్ చేయబోతున్నది. వాస్తవానికి జీమెయిల్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. చాలామంది ఏదో అవసరం కోసం జీమెయిల్ అకౌంట్‌ని తెరుస్తుంటారు. ఆ తర్వాత మరిచిపోతుంటారు. మళ్లీ అవసరం కోసం మళ్లీ కొత్త అకౌంట్‌ని క్రియేటర్ చేస్తుంటారు. మరికొందరు ఏదైనా అవసరం వచ్చిన సందర్భంల్లో వాడుతూ మళ్లీ.. దాని గురించి పట్టించుకోరు. దాంతో ఆయా అకౌంట్స్ అన్నీ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంటాయి.
ఈ ఇన్‌యాక్టివ్ మెయిల్స్ కారణంగా సర్వర్లపై భారపడుతున్నది. ఈ నేపథ్యంలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్‌ని తొలగించాలని గతంలో నిర్ణయించింది. గడువును సెప్టెంబర్ 20 వరకు ఇచ్చింది. ఈలోగా అవసరం ఉన్న మెయిల్స్‌ని యాక్టివ్‌గా చేసుకోవాలని.. లేకపోతే డిలీట్ చేయనున్నట్లు తెలిపింది. యాక్టివ్ చేసుకునేందుకు గడువు విధించిన తేదీలోగా మెయిల్ లాగిన్ చేసి వచ్చిన మెయిల్స్‌ని చదవడం.. ఎవరికో ఒకరికి మెయిల్ చేసినా సరిపోతుంది. లేకపోతే ఆటోమేటిక్‌గా జీమెయిల్ డిలీట్ అవుతుంది. లేకపోతే జీమెయిల్ అకౌంట్‌తో లింక్ అయిన యూట్యూబ్‌లో వీడియోలు చూసినా సరిపోతుంది. లేకుంటే ఏదైనా ఫొటోను మరొకరికి సెండ్ చేసిన మెయిల్ యాక్టివ్‌లోకి వస్తుంది. మెయిల్ అకౌంట్‌ని డిలీట్ చేస్తే.. ఫొటోస్ ఇలా ఏదైనా లింక్ అయిన ఉన్నా అన్నీ డిలీట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. తప్పనిసరిగా మెయిల్ అవసరమైన సందర్భంలో యాక్టివ్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఆ తర్వాత ఇబ్బందిపడాల్సి వస్తుంది.
Read Also :
Diamond Sector Crisis | సంక్షోభంలో దేశీయ వజ్ర పరిశ్రమ.. మూతపడుతున్న కర్మాగారాలు
NPS Vatsalya | పిల్లల కోసం పెన్షన్ ఖాతా.. ఎన్పీఎస్ వాత్సల్య షురూ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

