NPS Vatsalya | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో భాగంగా వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రారంభించారు. దీంతో పెన్షన్ అకౌంట్లో మదుపు చేయడం ద్వారా తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు పొదుపు చేసే అవకాశం దక్కుతున్నది.
ఎన్పీఎస్ చాలా ఆకర్షణీయమైన రాబడులను అందిస్తుందని, పిల్లల కోసం పొదుపు చేసే చక్కని అవకాశం దీనిద్వారా తల్లిదండ్రులకు దొరికిందని మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. అలాగే ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా 14 శాతం, కార్పొరేట్ రుణాల నుంచి 9.1 శాతం, జీ-సెక్యూరిటీలతో 8.8 శాతం రాబడులను ఎన్పీఎస్ ఖాతాదారులు పొందారని చెప్పారు. కాగా, పిల్లల కోసం ఇప్పటికే ఉన్న ఎన్పీఎస్కు ఈ ఎన్పీఎస్ వాత్సల్య ఓ పొడిగింపు.
ఈ ఎన్పీఎస్ అకౌంట్ల నుంచి ఉపసంహరణ కోసం మార్గదర్శకాలు సిద్ధం కావాల్సి ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను జూలైలో పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఈ స్కీంను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీం వివరాల్లోకి వెళితే..