IND vs ENG 5th Test : రాంచీ టెస్టులో భారత్‌ను గెలిపించిన యువ కెరటం శుభ్‌మన్ గిల్(53 నాటౌట్) మరో హాఫ్ సెంచరీ బాదాడు. ధర్మశాల(Dharmashala)లో రెండో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసిన గిల్.. ఈ సిరీస్‌లో నాలుగో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(75 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. దాంతో, భారత జట్టు వికెట్ నష్టానికి 186 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు వెనకబడి ఉంది.
A sublime knock at a picturesque venue! 🌄
Shubman Gill brings up his 4th Test fifty of the series 👏👏
Follow the match ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/NYV8Tr6a7k
— BCCI (@BCCI) March 8, 2024
ఓవర్‌నైట్ స్కోర్ 135-1తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. కుర్ర ఓపెనర్ యశస్వీ జైస్వాల్(57) హాఫ్ సెంచరీ బాదడంతో టీమిండియా ఇన్నింగ్స్ పరుగులు పెట్టింది. అయితే.. ఫిఫ్టీ తర్వాత బషీర్ ఓవర్లో యశస్వీ ఔటైనా.. రోహిత్, గిల్లు మరో వికెట్ పడకుండా ఆడారు.
Stumps on the opening day in Dharamsala! 🏔️#TeamIndia move to 135/1, trail by 83 runs.
Day 2 action will resume with Captain Rohit Sharma (52*) & Shubman Gill (26*) in the middle 💪
Scorecard ▶️ https://t.co/OwZ4YNtCbQ#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nhUXwzACi4
— BCCI (@BCCI) March 7, 2024
తొలి రోజు కుల్దీప్ యాదవ్ విజృంభణతో ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఓపెనర్ జాక్ క్రాలే(79) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ 4 వికెట్లు తీసి బెన్ స్టోక్స్ సేనను 218 పరుగులకే కట్టడి చేశాడు.