సూర్యాపేట, డిసెంబర్ 20 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి, ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ జన్మదిన వేడుకలను సూర్యాపేట పట్టణంలోని తొమ్మిదవ వార్డు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు గుండగాని నాగభూషణం మాట్లాడుతూ.. ఎస్ ఫౌండేషన్ ద్వారా గుంటకండ్ల సునీత చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమంది పేదల కండ్లల్లో ఆనందం నింపుతున్నట్లు తెలిపారు.
అలాగే సూర్యాపేట పట్టణానికి ఐదేళ్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పని చేసిన పెరుమాళ్ల అన్నపూర్ణ పట్టణంలో శివారు కాలనీలను అభివృద్ధి చేయడంతో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యక్రమంలో బఆర్ఎస్ నాయకులు మచ్చ రాము, షేక్ అన్వర్ పాషా, కట్ల మురళి, బొడ్డు దుర్గయ్య, కొచ్చర్ల వీరేశ్, అనుములపూరి శాంతి కుమార్, అనుములపూరి నవీన్, పోతురాజు తిరుమల్, మహిళా నాయకురాలు బండమీది రజిత, మారుపాక ఉప్పలమ్మ, షేక్ భాను పాల్గొన్నారు.

Suryapet : ‘ఎస్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో పేదల కండ్లలో ఆనందం’