Shreyas Iyer : భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పునరామనం కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఆటతో పాటు ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి నిత్యం శ్రమిస్తున్నాడు. టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ (Gautam Gambhir) నియామకం కావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కెప్టెన్లో ఆశలు చిగురించాయి.
వెన్నునొప్పి సాకుతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అయ్యర్.. గౌతీ అండతో జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం మైదానంలో నిత్యం చెమటోడ్చుతున్నాడు. ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన అయ్యర్ స్ప్రింటర్‌లా వేగంగా పరుగెత్తుతున్నాడు. ప్రస్తుతం అతడి రన్నింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
🚨 l am seeing him doing fitness regularly at wings, very hard working player, he was working out in rains also, no stopping. (AimAjit via IG ✍️)#ShreyasIyer pic.twitter.com/sLWCO61ZfH
— Pick-up Shot (@96ShreyasIyer) July 11, 2024
నిరుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో మెరిసిన అయ్యర్.. వెన్నునొప్పి సాకుతో రంజీలకు దూరమయ్యాడు. ముంబై తరఫున ఆడాలని బీసీసీఐ ఆదేశించినా పెడచెవిన పెట్టాడు. మరోవైపు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అయ్యర్ గాయపడలేదని, ఫిట్‌గానే ఉన్నాడని సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో, బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. జరగాల్సిన నష్టం జరిగాక అయ్యర్ ముంబై తరఫున రంజీ సెమీఫైనల్లో బరిలోకి దిగాడు.

ఐపీఎల్ పదిహేడో సీజన్లో గౌతం గంభీర్ మెంటార్‌గా, శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచింది. కోల్‌కతా మాజీ సారథిగా రెండు ట్రోఫీలు అందించిన గౌతీ.. ఈసారి మెంటార్‌గా మ్యాజిక్ చేశశాడు. భారత జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్‌ను అజేయ శక్తిగా మలిచాడు.

ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ వీర బాదుడుకు.. వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా బౌలింగ్ తోడవ్వడంతో లీగ్ దశ నుంచి ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థులను వణికించింది. ఇక కీలకమైన క్వాలిఫయర్ 1లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులోనూ మళ్లీ ఆరెంజ్ ఆర్మీపై అలవోక విజయంతో అయ్యర్ బృందం ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
2012, 2014, and 👇👇👇 pic.twitter.com/9nm5XCx5Pz
— KolkataKnightRiders (@KKRiders) May 26, 2024