London Bonalu | లండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతర.. ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు విన్యాసాలు
London Bonalu | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టా
London Bonalu | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు ఉపాధ్యక్షులు సత్యమూర్తి చిలుముల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ పాల్గొన్నారు.
స్వదేశంలో జరుపుకుంటున్నట్లుగానే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి బోనాల పండుగను నిర్వహించారు. ఈ బోనాల పండుగలో ముఖ్యంగా తొట్టెల ఊరేగింపు, పోతురాజుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉన్నత చదువుల కోసం లండన్‌కు వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్ మల్చేలం.. తన వంశవృత్తిని మరిచిపోకుండా పోతురాజు వేషధారణతో.. బోనాల ఊరేగింపులో పాల్గొని సరికొత్త శోభ తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా అతని ప్రవాసులతో పాటు బోనాల ఉత్సవాలకు హాజరైన విదేశీ ముఖ్య అతిథులు సైతం ప్రశంసించారు.
హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని అన్నారు. వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెబుతున్న తీరు చాలా గొప్పగా ఉందని అన్నారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిని ఇస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న తనను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలను సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
స్థానిక కౌన్సిలర్లు అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, ఆదేశ్ ఫర్మాహాన్, బంధన చోప్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి, అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఎంతో గర్వంగా అనిపించిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరినీ ప్రత్యేక సత్కరించి, బహుమతులు అందజేశారు.
కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకు తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని సూచించారు.
టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డల కోసం టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి.. అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. టాక్ సంస్థకు అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే ఇంత ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించుకున్నాం అని పేర్కొన్నారు.
సంస్థ ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి మాట్లాడుతూ.. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరూ బోనాలతో మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.
ఎన్నారై బీఆర్ఎస్యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ దూసరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగను లండన్‌లో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు – బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు.
ఈ బోనాల పండుగలో ప్రముఖ నృత్య కళాకారిణి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత రాగసుధా వింజమూరి ఇచ్చిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్ స్పాన్సర్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో ప్రశంశించింది. టాక్ ముఖ్య నాయకులు సుప్రజ పులుసు, గణేష్ కుప్పలా, హరిగౌడ్ నవపేట్, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, శ్రీకాంత్, క్రాంతి మాట్లాడుతూ.. బోనాల జాతర ఇంతటి విజయం సాధించడం సంతోషంగాఉందన్నారు.
ఈ బోనాల వేడుకలో టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, అశోక్ దూసరి, శుష్మున రెడ్డి, సత్య చిలుముల, మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, జాహ్నవి వేముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, రాకేష్ పటేల్, సత్యపాల్, మల్లా రెడ్డి, గణేష్ కుప్పాల, సత్యం కంది, శ్రీకాంత్ జెల్ల, శ్రీధర్ రావు, మధుసూదన్ రెడ్డి, శైలజ జెల్ల, స్నేహ, శ్వేతా మహేందర్, స్వాతి, క్రాంతి, పవిత్ర, సుప్రజ, శ్వేత, శ్రీ విద్య, నీలిమ, పృథ్వీ, మణితేజ, గణేష్ పాస్తం, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, నవీన్ రెడ్డి, కార్తీక్, రంజిత్, రాజేష్ వాక, మహేందర్, వంశీ, ఆనంద్, అక్షయ్, పావని , జస్వంత్, శివ వెన్న, నాగ్, మాడి, వినోద్, సన్నీ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. టాక్ సంస్థతో పాటు ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- bonalu
- london
- London Bonalu
- Nri
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!








