పారిస్: ఈ నెల 26వ తేదీ నుంచి పారిస్‌లో ఒలింపిక్స్(Paris Olympics) క్రీడలు జరగనున్నాయి. అయితే ఆ నగరంలో ఉన్న సీన్ నదిలోనే వాటర్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. సీన్ నదిలోని నీరు స్వచ్ఛంగా ఉందని చెప్పేందుకు ఆ దేశ క్రీడాశాఖ మంత్రి అమెలీ ఓడియా కాస్టెరా నదిలోకి దూకి ఈతకొట్టారు. నదిలో ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిలో మంత్రి అమెలీ స్విమ్ సూట్ డ్రెస్సులో దూకారు. అలెగ్రాండ్రే ఇన్వలైడ్స్ బ్రిడ్జ్ వద్ద ఆ మంత్రి ఈత కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
ఒలింపిక్స్‌కు చెందిన స్విమ్మింగ్ పోటీలను సీన్ నదిలో నిర్వహించనున్నారు. 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఈ నదిలోనే వాటర్ ఈవెంట్స్‌ను చేపట్టారు. ఇటీవల సీన్ నదిలో కాలుష్యం పెరిగిపోయింది. దీంతో ఆ నదిని శుద్ధి చేయాలన్న డిమాండ్ పెరిగింది. అయితే ఒలింపిక్స్ క్రీడల సమయానికి నదిని క్లీన్ చేసి స్విమ్మింగ్ క్రీడలను నిర్వహించనున్నట్లు ఆ నగర మేయర్ అన్నే హిడల్గో ఇటీవల తెలిపారు.
🚨🇫🇷FRENCH SPORTS MINISTER SWIMS IN SEINE AHEAD OF PARIS 2024 OLYMPICS
French Sports Minister Amelie Oudea Castera swam in the Seine on Saturday to show the river’s readiness for the Olympic swimming events.
She swam near the Alexandre III and Invalides bridges.
The Seine will… pic.twitter.com/i2z4HOCAwH
— Mario Nawfal (@MarioNawfal) July 13, 2024