Patolla Karthik Reddy | అధికార పార్టీతో చిల్లిగవ్వ లాభం లేదు.. అందుకే కాంగ్రెస్‌కు నేతలు గుడ్‌బై చెబుతున్నారు: పటోళ్ల కార్తీక్ రెడ్డి
Patolla Karthik Reddy | అధికార కాంగ్రెస్ పార్టీతో చిల్లిగవ్వ కూడా లాభం లేదని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారని అన్నారు. బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Patolla Karthik Reddy | అధికార కాంగ్రెస్ పార్టీతో చిల్లిగవ్వ కూడా లాభం లేదని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారని అన్నారు. బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గులాబీ కండువా కాప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అని జనం బలంగా నమ్ముతున్నారని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయని అన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాజేంద్రనగర్‌కు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. రాజేంద్ర నగర్‌కు మెట్రో రాకుండా చేశారని మండిపడ్డారు. బండ్లగూడ ప్రాంతాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని పేర్కొన్నారు. సైబరాబాద్‌కు మకుటం లాంటి ప్రాంతం మనది అని వ్యాఖ్యానించారు. సైబరాబాద్ నుంచి హైదరాబాద్‌కు పోదామా అని ప్రశ్నించారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మన పోరాటానికి ప్రభుత్వం దిగి రావాల్సిందేనని స్పష్టం చేశారు.
కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిచేది గులాబీ పార్టీనే అని కార్తీక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో మూడు మున్సిపాలిటీలు మనమే గెలుస్తామని.. కాంగ్రెస్ పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిపిస్తామని అన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

