బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 10, 2021 , 19:24:36

కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..వైస్‌ కెప్టెన్‌గా పృథ్వీ షా

కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..వైస్‌ కెప్టెన్‌గా పృథ్వీ షా

ముంబై: భుజం గాయం కారణంగా భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.  గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమయ్యే విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. భారత ఓపెనర్ పృథ్వీ షాను  వైస్ కెప్టెన్‌గా నియమించారు. 

దేశవాళీ టోర్నీ కోసం ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ 22 మంది సభ్యుల జట్టును ఇవాళ ప్రకటించింది.  ఈ టోర్నమెంట్‌ కోసం భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్‌ పవార్‌ను  ఆ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ముంబై జట్టులో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, యంగ్‌ ఓపెనర్‌ యశస్వి, సర్ఫరాజ్‌ ఖాన్‌, వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ ఆదిత్య తారే, సీనియర్‌ బౌలర్‌ దవల్‌ కులకర్ణి, తుషార్‌ దేశ్‌పాండేతో పాటు ప్రతిభావంతులైన ఆటగాళ్లు   ఉన్నారు. 

VIDEOS

logo