Shreyas Iyer | ఆసీస్‌తో వన్డే సిరీస్.. శ్రేయాస్ అయ్యర్ అడేది అనుమానమే..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్(ODI series)కు ముందు టీమిండియాకు షాక్.. భారత జట్టు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. వెన్ను నొప్పి(Lower backpain)తో బాధపడుతున్న అతను అహ్మదాబాద్ టెస్టు (Ahmedabad test)లో బరిలోకి దిగలేదు.
Shreyas Iyer : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్(ODI series)కు ముందు టీమిండియాకు షాక్.. భారత జట్టు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. వెన్ను నొప్పి(Lower backpain)తో బాధపడుతున్న అతను అహ్మదాబాద్ టెస్టు (Ahmedabad test)లో బరిలోకి దిగలేదు. పదో స్థానంలోనూ అయ్యర్ బ్యాటింగ్‌కు రాలేదు. అతను వన్డే సిరీస్‌లో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా ఉంది. అయితే.. బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఈ స్టార్ ప్లేయర్ ఆడడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. మరిన్ని టెస్టులు చేస్తేగానీ ఒక నిర్ణయానికి రాలేమని బీసీసీఐ వైద్యులు చెప్తున్నారు. ‘ఆఖరి టెస్టు మూడో రోజు అయ్యర్ వెన్నెముక కింది భాగంలో నొప్పి ఉందని చెప్పాడు. అతడికి స్కానింగ్ తీయించాం. బీసీసీఐ వైద్య బృందం అయ్యర్ ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది’ అని బీసీసీఐ ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది.
సెలెక్టర్ల నిర్ణయంపై
వన్డే సిరీస్‌లో అయ్యర్ ఆడతాడా? లేదా? అనేది సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది. అతని నొప్పి తీవ్రతను బట్టి సిరీస్‌లో ఆడించాలా? లేదా విశ్రాంతినివ్వాలా? అనే విషయమై సెలెక్టర్లు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. గత ఏడాది వెన్నునొప్పి కారణంగా అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు, బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు దూరమయ్యాడు. నొప్పి మళ్లీ తిరగబెట్టడంతో అతను ఆఖరి టెస్టులో బ్యాటింగ్‌కు రాలేదు. మిడిలార్డర్లో కీలకమైన అయ్యర్ గత ఏడాది వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఒకవేళ వన్డే సిరీస్‌కు అతను దూరమైతే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను ఆడించే అవకాశం ఉంది.
వన్డే షెడ్యూల్ ఇదే
భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. మార్చి 17న తొలి వన్డే ముంబైలో ప్రారంభం కానుంది. మార్చి 19న విశాఖపట్నంలో రెండో వన్డే ఉంది. ఆఖరి వన్డే మార్చి 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు వన్డే సిరీస్ జట్లను ప్రకటించాయి. 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్ కూడా నెగ్గాలనే పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి
Shadab Khan | షాదాబ్‌కు పాకిస్థాన్ టీ20 కెప్టెన్సీ.. బ్యాటింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ యూసఫ్
Border – Gavaskar Trophy | బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రికార్డులు బద్ధలు కొట్టింది వీళ్లే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

