IND vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్(105 : 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో) సెంచరీలతో కదం తొక్కారు. ఆడం జంపా(Adam Zampa) ఓవర్లో సింగిల్ తీసి అయ్యర్ శతకం సాధించాడు. 50 ఓవర్ల ఆటలో శ్రేయస్‌కు ఇది మూడో సెంచరీ. అయితే.. సియాన్ అబాట్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(95 నాటౌట్) సెంచరీకి చేరువగా ఉన్నాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో200 పరుగులు జోడించారు. 31 ఓవర్లకు స్కోర్.. 217/2.
Resilience & determination 👏👏
Well done @ShreyasIyer15! 🙌#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank https://t.co/zNjuXqDb8T pic.twitter.com/GqS4cndhF4
— BCCI (@BCCI) September 24, 2023
ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. హేజిల్‌వుడ్ దెబ్బకు 16 రన్స్ వద్దే ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. మొదటి వన్డేలో దంచి కొట్టిన రుతురాజ్ గైక్వాడ్(8) తక్కువకే వెనుదిరిగాడు. ఆ తర్వాత గిల్, అయ్యర్ ధనాధన్ ఆడుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.