దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. 4 వికెట్ల తేడాతో కంగారూలను మట్టికరిపించి.. ఫైనల్లో దూసుకెళ్లింది రోహిత్ సేన. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శించిన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)కు ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ మెడల్‌ను బహూకరించారు. మాజీ క్రికెటర్, మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి.. ఆ మెడల్‌ను అయ్యర్‌కు అందజేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్సీ క్యారీని.. అయ్యర్ ఔట్ చేశాడు. అద్భుతమైన రీతిలో డైరెక్ట్ త్రో వేయడంతో.. క్యారీ రనౌట్ అయ్యాడు. అతను ఔట్ కావడం వల్ల.. ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్‌కు నిలువరించాల్సి వచ్చింది. క్యారీని రనౌట్ చేయడం వల్ల.. చివర్లో కనీసం 20 పరుగల్ని సేవ్ చేసినట్లు క్రికెట్ నిపుణులు అంచనా వేశారు.
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗠𝗮𝘁𝗰𝗵 | #INDvAUS
It was a battle of heavyweights 💪
🎙️And there was just one voice that “roared” in the dressing room to announce the winner 🏅😎#TeamIndia | #ChampionsTrophyhttps://t.co/lA6G3SRlG4
— BCCI (@BCCI) March 5, 2025
అలెక్సీ క్యారీ 61 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 48వ ఓవర్ తొలి బంతికి.. బ్యాక్వర్డ్ స్క్వేర్ దిశలో బంతిని కొట్టి .. రెండు పరుగుల కోసం క్యారీ ప్రయత్నించాడు. అయితే డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి వేగంగా పరుగెత్తుకొచ్చిన అయ్యర్ .. చేతుల్లోకి బంతిని తీసుకుని నేరుగా వికెట్లకు విసిరేశాడు. బుల్లెట్ వేగంతో వచ్చిన ఆ త్రోకు క్యారీ రనౌట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరును కొంత వరకు నిలువరించారు. క్యారీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. స్టీవ్ స్మిత్‌తో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌లోనూ కీ రోల్ ప్లే చేశాడు. రెండు వికెట్లు పడిన తర్వాత .. కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ ఇద్దరి మధ్య 91 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 62 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యాడు. దాంట్లో మూడు బౌండరీలు ఉన్నాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు ఫుల్ ఎంజాయ్ చేశారు.
𝘿𝙤 𝙣𝙤𝙩 𝙢𝙞𝙨𝙨!
A bundle of emotions from a joyous bunch! 🫂
📽️ Presenting raw moments from #TeamIndia‘s semi-final victory over Australia 👌👌#INDvAUS | #ChampionsTrophy
— BCCI (@BCCI) March 4, 2025