ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్‌లో న్యూజిలాండ్, టీం ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 28వ ఓవర్లో మూడో బంతి సింగిల్ తీయడం ద్వారా శ్రేయాస్ అయ్యర్ 50 పరుగులు పూర్తి చేశాడు. 75 బంతులు ఆడిన శ్రేయాస్ అయ్యర్ నాలుగు ఫోర్లు కొట్టాడు. తొలుత టాస్ గెలుచుకున్న న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన టీం ఇండియా సారధి రోహిత్ శర్మ 15 పరుగులకే ఔట్ కాగా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండు పరుగులు చేసి హెన్రీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాట పట్టాడు.
వన్ డౌన్ బ్యాటర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన విరాత్ కోహ్లీ 14 బంతులను ఎదుర్కొని 11 పరుగులతో హెన్నీ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్సర్ పటేల్‌తో కలిసి శ్రేయాస్ అయ్యర్ జట్టు స్కోర్ నిలకడగా పెంచేందుకు ప్రయత్నిస్తున్న దశలో మరోవైపు, 30వ ఓవర్లో రవీంద్ర బౌలింగ్‌లో అక్సర్ పటేల్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి ఆయన 42 పరుగులు చేశాడు. దీంతో టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.